Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 189

డబ్బేతెలివి ఒక వ్యక్తి న్యూయార్క్‌లో సన్నని వీధి గుండా రాత్రి పూట వెళుతూ ఉంటే ఒక దొంగ హఠాత్తుగా వచ్చి అతని తలకు పిస్టల్‌ ఆనించి “నీ దగ్గరున్న డబ్బంతా ఇచ్చెయ్‌! లేకుంటే నీ మెదడు చిట్లిపోయేలా కాల్చేస్తాను” అన్నాడు. దానికి ఆ వ్యక్తి “నోప్రాబ్లం! అమెరికాలో మెదడు లేకుండా బతకవచ్చు కానీ డబ్బు లేకుండా బ్రతకలేం” అన్నాడు. ——————————————————————— డాక్టర్‌తో చావు డాక్టర్‌ పేషెంట్‌ని పరీక్షించి సీరియస్‌గా లేచి పక్కనే నిల్చున్న పేషెంట్‌ భార్యతో “అయామ్‌ […]

డబ్బేతెలివి
ఒక వ్యక్తి న్యూయార్క్‌లో సన్నని వీధి గుండా రాత్రి పూట వెళుతూ ఉంటే ఒక దొంగ హఠాత్తుగా వచ్చి అతని తలకు పిస్టల్‌ ఆనించి “నీ దగ్గరున్న డబ్బంతా ఇచ్చెయ్‌! లేకుంటే నీ మెదడు చిట్లిపోయేలా కాల్చేస్తాను” అన్నాడు.
దానికి ఆ వ్యక్తి “నోప్రాబ్లం! అమెరికాలో మెదడు లేకుండా బతకవచ్చు కానీ డబ్బు లేకుండా బ్రతకలేం” అన్నాడు.
———————————————————————
డాక్టర్‌తో చావు
డాక్టర్‌ పేషెంట్‌ని పరీక్షించి సీరియస్‌గా లేచి పక్కనే నిల్చున్న పేషెంట్‌ భార్యతో
“అయామ్‌ సారీ! అతను చనిపోయినట్లున్నాడు” అన్నాడు
పేషెంట్‌ సన్నని స్వరంతో “లేదు నేను బతికేవున్నాను” అన్నాడు.
పేషెంట్‌ భార్య “మీరు ఊరుకోండి ఆరోగ్యం గురించి మీకన్నా డాక్టర్‌ గారికే బాగా తెలుస్తుంది” అంది.
———————————————————————

చందా
ఒకమ్మాయి చందాలకోసం వచ్చింది. ఆ ఇంట్లో వృద్ధుడున్నాడు. అతనా అమ్మాయితో
“చందా ఎందుకమ్మా?” అన్నాడు.
ఆ అమ్మాయి “దేవుని కివ్వడానికి” అంది.
ఆ వృద్ధుడు “నీ వయసెంత?” అన్నాడు.
ఆ అమ్మాయి “పందొమ్మిదేళ్లు” అంది
వృద్ధుడు “నా వయసు ఎనభై తొమ్మిది! నీకంటే డెబ్బయి సంవత్సరాలు ఎక్కువ. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్లడానికి చాలా టైముంది. నీకంటే ముందుగా నేను వెళతాను కదా! నేనే ఆయనకిస్తా, వెళ్లిరా” అన్నాడు.
ఆ అమ్మాయి ముఖం వెలవెల బోయింది.

First Published:  28 Aug 2015 1:03 PM GMT
Next Story