Telugu Global
Others

సోంపేట థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుకు ఫుల్‌స్టాప్‌

ఏపీ కేబినెట్‌ నిర్ణయం… కేటాయించిన భూములు వెనక్కి శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నిర్మించతలపెట్టిన థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణ జీవోను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. థర్మల్‌ ప్లాంటుకు కేటాయించిన 972 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని, ఆ ప్రాంతంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పలాని నిర్ణయించింది. శనివారం సుదీర్ఘంగా ఏడు గంటలపాటు జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు తెలిపారు. 2008లో ఈ […]

సోంపేట థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుకు ఫుల్‌స్టాప్‌
X
ఏపీ కేబినెట్‌ నిర్ణయం… కేటాయించిన భూములు వెనక్కి శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నిర్మించతలపెట్టిన థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణ జీవోను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. థర్మల్‌ ప్లాంటుకు కేటాయించిన 972 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని, ఆ ప్రాంతంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పలాని నిర్ణయించింది. శనివారం సుదీర్ఘంగా ఏడు గంటలపాటు జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు తెలిపారు. 2008లో ఈ భూములన వై.ఎస్‌. ప్రభుత్వం కేటాయించింది. ఆ భూములను మల్టీ ప్రొడక్ట్స్‌ తయారు చేసే పరిశ్రమలకు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. పరిశ్రమలకు ఇచ్చే భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే అంశంలో విధివిధానాలు ఖరారు చేయాలని నిర్ణయించింది. చిట్‌ఫండ్‌ మోసాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని, మోసాలకు గురయ్యే బాధితులకు సకాలంలో న్యాయం అందేట్టు చూడాలని కేబినెట్‌ నిర్ణయించింది. వివిధ కేసుల్లో విచారణ సంస్థల జప్తులో ఉన్న భూములపై దృష్టి సారించాలని కూడా మంత్రివర్గం అభిప్రాయపడినట్టు అచ్చెన్నాయుడు చెప్పారు.
అలాగే నీటి సంఘాలు, మార్కెట్‌ కమిటీలు, పాలక మండళ్ళపై చర్చ జరిగిందని, వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని భావించినట్టు తెలిపారు. ఇంటర్‌ వరకు తెలుగులో బోధన తప్పనిసరి ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ వరకు తెలుగులో బోధన తప్పనిసరి చేస్తూ నిర్ణయించింది. వ్యాపార సంస్థల బోర్డులన్నీ ఇక తెలుగులోనే రాయాలని, తెలుగుకు ప్రాచీన హోదా కోసం హైలెవెల్‌ కమిటీని వేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాజధాని మాస్టర్‌ డెవ్‌లపర్‌ అంశంపై కూడా చర్చ జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కార్మిక సంస్కరణలపై అంశంపైన, ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తుల జప్తుపైన కూడా కేబినెట్‌ చర్చించినట్టు చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులకు జీతాలు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రయివేటు యూనివర్శిటీల బిల్లు, ఆసైన్డ్‌ భూముల క్రమబద్దీకరణ, సింహాచలం దేవస్థానం భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. ఐటీ పాలసీలో భాగంగా ఉద్యోగ నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జాతీయస్థాయిలో నెడ్‌కేప్‌కు 3 పురస్కారాలు లభించడం సంతోషంగా ఉందని, సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో ఏపీ ప్రభుత్వ విధానాలకు అవార్డులు సాధించడం అభినందనీయమని, ఈ విషయంలో కేంద్రం నుంచి ప్రశంసలు లభించడంపై మంత్రివర్గం ఆనందం వ్యక్తం చేసింది. ఇందుకుగాను ఇంధన కార్యదర్శి అజయ్‌జైన్‌, నెడ్‌క్యాప్‌ సీఎండీ కమలాకర్‌ బాబులను చంద్రబాబు నాయుడు అభినందించారు.
First Published:  29 Aug 2015 6:27 AM GMT
Next Story