Telugu Global
Others

మా అమ్మ చాలా శ‌క్తివంతురాలు: షీనా సోద‌రుడు 

దేశ‌వ్యాప్తంగా సంచల‌నం సృష్టించిన షీనా బోరా హ‌త్య కేసులో ముంబై పోలీసులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. హ‌తురాలు షీనా సోద‌రుడు మిఖాయిల్‌ను గౌహతిలోనూ, కోల్‌క‌తాలో నిందితులు ఇంద్రాణి మాజీ భ‌ర్త సంజీవ్‌ ఖ‌న్నాను, ముంబైలో ఇంద్రాణిని, ఆమె భ‌ర్త పీట‌ర్ ముఖ‌ర్జియా కొడుకు రాహుల్‌ను పోలీసులు విచారించారు. పోలీసుల విచార‌ణ‌లో షీనా సోద‌రుడు ప‌లు కీల‌క‌ స‌మాచారం అందించాడ‌ని,  సోద‌రిని హ‌త్య చేసిన అనంత‌రం త‌న‌ను కూడా ఇంద్రాణి చంపేసేదేమోన‌న్న‌  అనుమానం వ్య‌క్తం చేశాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు. […]

మా అమ్మ చాలా శ‌క్తివంతురాలు: షీనా సోద‌రుడు 
X
దేశ‌వ్యాప్తంగా సంచల‌నం సృష్టించిన షీనా బోరా హ‌త్య కేసులో ముంబై పోలీసులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. హ‌తురాలు షీనా సోద‌రుడు మిఖాయిల్‌ను గౌహతిలోనూ, కోల్‌క‌తాలో నిందితులు ఇంద్రాణి మాజీ భ‌ర్త సంజీవ్‌ ఖ‌న్నాను, ముంబైలో ఇంద్రాణిని, ఆమె భ‌ర్త పీట‌ర్ ముఖ‌ర్జియా కొడుకు రాహుల్‌ను పోలీసులు విచారించారు. పోలీసుల విచార‌ణ‌లో షీనా సోద‌రుడు ప‌లు కీల‌క‌ స‌మాచారం అందించాడ‌ని, సోద‌రిని హ‌త్య చేసిన అనంత‌రం త‌న‌ను కూడా ఇంద్రాణి చంపేసేదేమోన‌న్న‌ అనుమానం వ్య‌క్తం చేశాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు. విచార‌ణ కోసం ముంబై పిలిస్తే వ‌చ్చి పోలీసుల‌కు స‌హ‌క‌రిస్తాన‌ని మిఖాయిల్‌ చెప్పాడు. ఇది ప‌రువు హ‌త్యా లేక ఆర్థిక నేర‌మా అన్న‌ది తెలియాల్సి ఉంద‌ని, త్వ‌ర‌లో కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

First Published:  27 Aug 2015 1:10 PM GMT
Next Story