Telugu Global
Others

హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించండి: పాక్‌ సుప్రీం  

కూల్చేసిన హిందూ దేవాలయాన్ని వెంటనే పునరుద్ధరించాల్సిందిగా పాక్‌ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరాక్ జిల్లాలోని ఖైబర్‌ పఖ్తున్యలో గతంలో కూల్చేసిన శ్రీ పరమహంసజీ మహరాజ్‌ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలని కోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అందుకోసం తగిన ప్రణాళికతో తిరిగి న్యాయస్థానానికి రావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడానికి వీలులేదని హెచ్చరించింది. దేవాలయ పునర్నిర్మాణ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలు దెబ్బతినకుండా వాస్తుశిల్పి సలహాలను తీసుకోవాలని ఆదేశిస్తూ కేసు విచారణను వచ్చేనెల 7కు వాయిదా వేసింది. 1991లో నిర్మించిన ఈ […]

కూల్చేసిన హిందూ దేవాలయాన్ని వెంటనే పునరుద్ధరించాల్సిందిగా పాక్‌ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరాక్ జిల్లాలోని ఖైబర్‌ పఖ్తున్యలో గతంలో కూల్చేసిన శ్రీ పరమహంసజీ మహరాజ్‌ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలని కోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అందుకోసం తగిన ప్రణాళికతో తిరిగి న్యాయస్థానానికి రావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడానికి వీలులేదని హెచ్చరించింది. దేవాలయ పునర్నిర్మాణ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలు దెబ్బతినకుండా వాస్తుశిల్పి సలహాలను తీసుకోవాలని ఆదేశిస్తూ కేసు విచారణను వచ్చేనెల 7కు వాయిదా వేసింది. 1991లో నిర్మించిన ఈ దేవాలయాన్ని దుండుగులు 1997లో కూల్చేశారు. ఖాళీగా ఉన్న ఈ స్థలాన్ని మౌల్వి ఇఫ్తిఖారుద్దీన్‌ ఆక్రమించుకున్నారు.
First Published:  27 Aug 2015 1:17 PM GMT
Next Story