Telugu Global
NEWS

నిమ్స్ డైరెక్ట‌ర్‌గా మ‌నోహ‌ర్‌

నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ కందకట్ల మనోహర్ నియమితులయ్యారు. వరంగల్‌లోని ఎంజీఎం వైద్యశాల సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నమ‌నోహ‌ర్ డాక్టర్ నరేంద్రనాథ్ స్థానంలో కొత్త డైరెక్ట‌ర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. నరేంద్రనాథ్ 2013 ఆగస్టు 31న నిమ్స్‌లో ఆర్థోపెడిక్ వైద్యునిగా పదవీ విరమణ చేశారు. అనంతరం అప్పటి సీఎం కిరణ్‌కుమార్ ఆయనను డైరెక్టర్‌గా నియమించగా, సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. 2015 సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ న‌రేంద్ర‌నాథ్ ప‌ద‌వీ కాలం ఉంది. ఇంకా నెల‌రోజులు […]

నిమ్స్ డైరెక్ట‌ర్‌గా మ‌నోహ‌ర్‌
X
నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ కందకట్ల మనోహర్ నియమితులయ్యారు. వరంగల్‌లోని ఎంజీఎం వైద్యశాల సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నమ‌నోహ‌ర్ డాక్టర్ నరేంద్రనాథ్ స్థానంలో కొత్త డైరెక్ట‌ర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. నరేంద్రనాథ్ 2013 ఆగస్టు 31న నిమ్స్‌లో ఆర్థోపెడిక్ వైద్యునిగా పదవీ విరమణ చేశారు. అనంతరం అప్పటి సీఎం కిరణ్‌కుమార్ ఆయనను డైరెక్టర్‌గా నియమించగా, సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. 2015 సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ న‌రేంద్ర‌నాథ్ ప‌ద‌వీ కాలం ఉంది. ఇంకా నెల‌రోజులు ప‌ద‌వీకాలం ఉంటుండ‌గానే న‌రేంద్ర‌నాథ్ స్థానంలో కొత్త డైరెక్ట‌ర్ గా మ‌నోహ‌ర్ నియ‌మించ‌డం విశేషం.
న‌రేంద్ర‌నాథ్ నియామ‌కంపై కేసు
ఎంసీఐ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా (నిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ నరేంద్రనాథ్ నియామ‌కం జ‌రిగింద‌ని.. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన డాక్ట‌ర్ ఆర్‌జే భాస్క‌ర్ గ‌త ఏడాది హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. మెడిక‌ల్ టీచింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ లేని న‌రేంద్ర‌నాథ్ నియామ‌కం ఎంసీఐ నిబంధ‌న‌లు రూల్ 30కి విరుద్ధ‌మ‌ని పిటిష‌న‌ర్ కోర్టుకు తెలిపారు. మ‌రోవైపు సీమాంధ్ర‌కు చెందిన న‌రేంద్ర‌నాథ్ నియామ‌కంపై తెలంగాణ‌వాదులు కూడా ఆందోళ‌నలు నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో న‌రేంద్ర‌నాథ్‌ను త‌ప్పించి.. మ‌నోహ‌ర్‌ను కొత్త డైరెక్ట‌ర్ గా నియ‌మించారు.
పెంచిక‌ల‌పేట నుంచి అంచెలంచెలుగా .
వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామంలో జన్మించిన మనోహర్ 1981లో ఉస్మానియా మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్నారు. 1986లో గాంధీ మెడికల్ కళాశాల నుంచి ఎండీ (జనరల్ మెడిసిన్) పట్టా అందుకున్నారు. 1986లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా ఉద్యోగంలో చేరిన ఆయన 1987వరకు అక్కడే పనిచేశారు.1987 నుంచి 2001వరకు ఎంజీఎంలో మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. 1999 నుంచి 2001 వరకు కార్డియాలజీ విభాగంలో ట్యూటర్‌గా పనిచేశారు. 2001 నుంచి 2006వరకు న్యూరాలజీ ఇన్‌చార్జి అధిపతిగా మెడిసిన్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2006 నుంచి ఎంజీఎం, కేఎంసీలో మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాటు మెడిసిన్, కార్డియాలజీ విభాగాలకు మనోహర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 2011 నుంచి 13వరకు ఎంజీఎం ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఆ తరువాత ఎంజీఎం సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్నారు.
First Published:  28 Aug 2015 5:41 AM GMT
Next Story