Telugu Global
Cinema & Entertainment

ఆ విష‌యంలో తాతకు త‌గ్గ మ‌న‌వ‌డు..! 

అఖిల్  వినాయక్ డైరెక్ష‌న్ లో చేస్తున్న చిత్రం లో  యాక్షన్ సీన్లు మాత్రమే కాదు…డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడని టాక్. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నారు.. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు.  ద‌స‌రా బుల్లోడు చిత్రంలో ఏ ఎఆన్ ఆర్ స్టేప్స్ కు అప్ప‌టి ప్రేక్ష‌క లోకం ఉర్రూత లూగింది. […]

ఆ విష‌యంలో తాతకు త‌గ్గ మ‌న‌వ‌డు..! 
X
అఖిల్ వినాయక్ డైరెక్ష‌న్ లో చేస్తున్న చిత్రం లో యాక్షన్ సీన్లు మాత్రమే కాదు…డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడని టాక్. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నారు.. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. ద‌స‌రా బుల్లోడు చిత్రంలో ఏ ఎఆన్ ఆర్ స్టేప్స్ కు అప్ప‌టి ప్రేక్ష‌క లోకం ఉర్రూత లూగింది.
మొత్తం మీద అక్కినేని వారి న‌ట వార‌సుల్లో చివ‌రిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా. శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, ఈ నెల 29 న టీజ‌ర్.. మ‌రియు సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌డానికి స‌న్న‌హాలు చేస్తున్న‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్.
First Published:  27 Aug 2015 7:04 PM GMT
Next Story