Telugu Global
Others

బాబుపై క‌త్తిదూస్తున్న వామ‌ప‌క్షాలు

భూసేక‌ర‌ణ‌, హోదాపై 9 లెఫ్ట్ పార్టీల ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ అభివృద్ధి పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడ‌ని వామ‌ప‌క్షాలు విమ‌ర్శించాయి. చంద్ర‌బాబు భూ విధానానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌ని అవి ప్ర‌క‌టించాయి. రియ‌ల్ ఎస్టేట్ వ్యూహంలో భాగంగానే రాజ‌ధాని, ఇత‌ర‌త్రా అభివృద్ది కార్య‌క‌లాపాల పేరుతో ఇప్ప‌టికే 1.20 ల‌క్ష‌ల ఎక‌రాల భూమిని చంద్ర‌బాబు సేక‌రించార‌ని వామ‌ప‌క్ష పార్టీలు పేర్కొన్నాయి. కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకునే స‌మ‌యంలో కూడా ప్ర‌తిప‌క్షాల‌ను క‌నీసం […]

బాబుపై క‌త్తిదూస్తున్న వామ‌ప‌క్షాలు
X
భూసేక‌ర‌ణ‌, హోదాపై 9 లెఫ్ట్ పార్టీల ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌
అభివృద్ధి పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడ‌ని వామ‌ప‌క్షాలు విమ‌ర్శించాయి. చంద్ర‌బాబు భూ విధానానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌ని అవి ప్ర‌క‌టించాయి. రియ‌ల్ ఎస్టేట్ వ్యూహంలో భాగంగానే రాజ‌ధాని, ఇత‌ర‌త్రా అభివృద్ది కార్య‌క‌లాపాల పేరుతో ఇప్ప‌టికే 1.20 ల‌క్ష‌ల ఎక‌రాల భూమిని చంద్ర‌బాబు సేక‌రించార‌ని వామ‌ప‌క్ష పార్టీలు పేర్కొన్నాయి. కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకునే స‌మ‌యంలో కూడా ప్ర‌తిప‌క్షాల‌ను క‌నీసం సంప్ర‌దించ‌కుండా చంద్ర‌బాబు ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా, చంద్ర‌బాబు భూవిధానంపై తొమ్మిది వామ‌ప‌క్ష పార్టీలు హైద‌రాబాద్‌లోని మ‌ఖ్దుం భ‌వ‌న్‌లో స‌మావేశ‌మై చ‌ర్చించాయి. బాబుపై పోరాటానికి గాను ఒక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను అవి నిర్దేశించుకున్నాయి. ఈ స‌మావేశంలో సిపిఎం రాష్ట్ర కారద్యర్శి పెనుమల్లి మధు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో రైతుల వద్ద నుంచి చంద్రబాబు బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారని అన్నారు. ఏకంగా 1.20 లక్షల ఎకరాలను సేకరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఎకరాలతో ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. వీటిని బడా పారిశ్రామిక వేత్తలకు 99 ఏళ్ల పాటు కారుచౌకగా లీజుకిస్తున్నారని వాపోయారు. చంద్రబాబు చేస్తున్నది పక్కా బిజినెస్‌ అని, అభివృద్ధి కాదని తెలిపారు. పరిశ్రమలు, విమానాశ్రయం పేరుతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాది ఎకరాలను రైతుల వద్ద నుంచి లాక్కుంటున్నారని తెలిపారు.
అటవీ భూములను సైతం స్వాధీనం చేసుకుంటున్నారని తెలిపారు. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో 1.60 లక్షల ఎకరాలను లాక్కున్నారని తెలిపారు.వామపక్షాలు భూ సేకరణను అడ్డుకుంటున్నాయన్న అక్కసుతో అభివృద్ధికి వ్యతిరేకమంటూ బిజెపి, టిడిపి ప్రచారం చేస్తున్నాయన్నారు. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సెజ్‌ల పేరుతో గతంలో తీసుకున్న భూములన్నీ ఖాళీగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందుకు ఉదహారణగా కాకినాడ సెజ్‌ సహా మరికొన్ని సెజ్‌లను ఆయన ప్రస్తావించారు. సిఆర్‌డిఏను 18 లక్షల ఎకరాలు పరిధిలో ప్రకటించారని, రాజధాని కోసం 1.20 లక్షల ఎకరాలు తీసుకుంటామనడం వ్యాపారం తప్ప పరిపాలన కాదని అన్నారు. బిజెపి సర్కార్‌పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని మధు తెలిపారు. ఈ నెల 29న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నిర్వహించే రాష్ట్ర బంద్‌కు తాము మద్దతు ప్రకటిస్తున్నామని ప్రకటించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న భూ విధానానికి వ్యతిరేకంగా వామపక్షాలుగా ఐక్య పోరాటం సాగిస్తామని చెప్పారు. పెద్దలకు భూమిని కట్టబెట్టాలన్న ఉద్దేశంతో లక్షలాది ఎకరాలను సేకరించాలని చూస్తున్నారని ఆరోపించారు. దీన్ని ఆదిలోనే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. పంటలు పండే భూములను స్వాధీనం చేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, పిజె చంద్రశేఖరరావు (సిపిఐ), చిట్టిపాటి వెంకటేశ్వర్లు (సిపిఐ-ఎంఎల్‌), అరుణోదయ రామారావు (న్యూ డెమోక్రసీ), ఎన్‌ మూర్తి (లిబరేషన్‌), గుర్రం విజయకుమార్‌ (సిపిఐ-ఎంఎల్‌), ఎం వెంకటరెడ్డి (ఎంసిపిఐ-యూ), చంద్రారెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్‌), బిఎస్‌ అమరనాథ్‌ (ఎస్‌యూసిఐ-సి) పాల్గొన్నారు.
First Published:  25 Aug 2015 9:24 PM GMT
Next Story