Telugu Global
Others

దేవుళ్ల‌కు హార‌తి బంద్ 

దేవాదాయ శాఖ అర్చ‌కులు స‌మ్మెకు దిగ‌డంతో తెలంగాణ‌లోని దేవుళ్లకు  ప్ర‌త్యేక  హార‌తి కరువైంది. ట్రెజ‌రీ ద్వారా వేత‌నాలు చెల్లించాల్సిందిగా ఎండోమెంట్ శాఖ ప‌రిధిలోని అర్చ‌కులు, ఉద్యోగులు  మంగ‌ళ‌వారం నుంచి స‌మ్మెకు దిగారు. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా దేవాల‌యాల్లో హార‌తి బంద్ అయింది. అర్చ‌కులు కేవ‌లం  ఉద‌యం, సాయంత్రం నిత్య పూజ‌లే  మాత్ర‌మే నిర్వ‌హిస్తున్నారు. ఆల‌యాల్లో హార‌తి ఇచ్చేందుకు అర్చ‌కులు లేక‌పోవ‌డంతో భ‌క్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గ‌తంలో స‌మ్మె చేప‌ట్టిన‌ప్పుడు ఏర్పాటు చేసిన త్రిస‌భ్య క‌మిటీ నివేదిక నెల‌రోజుల్లో […]

దేవుళ్ల‌కు హార‌తి బంద్ 
X
దేవాదాయ శాఖ అర్చ‌కులు స‌మ్మెకు దిగ‌డంతో తెలంగాణ‌లోని దేవుళ్లకు ప్ర‌త్యేక హార‌తి కరువైంది. ట్రెజ‌రీ ద్వారా వేత‌నాలు చెల్లించాల్సిందిగా ఎండోమెంట్ శాఖ ప‌రిధిలోని అర్చ‌కులు, ఉద్యోగులు మంగ‌ళ‌వారం నుంచి స‌మ్మెకు దిగారు. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా దేవాల‌యాల్లో హార‌తి బంద్ అయింది. అర్చ‌కులు కేవ‌లం ఉద‌యం, సాయంత్రం నిత్య పూజ‌లే మాత్ర‌మే నిర్వ‌హిస్తున్నారు. ఆల‌యాల్లో హార‌తి ఇచ్చేందుకు అర్చ‌కులు లేక‌పోవ‌డంతో భ‌క్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గ‌తంలో స‌మ్మె చేప‌ట్టిన‌ప్పుడు ఏర్పాటు చేసిన త్రిస‌భ్య క‌మిటీ నివేదిక నెల‌రోజుల్లో స‌మ‌ర్పించాల్సి ఉండ‌గా ఇంత‌వ‌ర‌కూ ఇవ్వ‌లేద‌ని అర్చ‌క ఉద్యోగ‌ సంఘ నేత‌లు ఆరోపించారు. ఈసారి ప్ర‌భుత్వం వద్ద నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించేవ‌ర‌కు స‌మ్మె కొన‌సాగిస్తామ‌ని అన్నారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు చిక్క‌డ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం ఎదుట నిర్వ‌హించిన ధ‌ర్నాకు బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష‌నేత కె.ల‌క్ష్మ‌ణ్ సంఘీభావం ప్ర‌క‌టించారు.
First Published:  25 Aug 2015 1:19 PM GMT
Next Story