Telugu Global
Cinema & Entertainment

ఈ సారైన  ఆ జంట‌కు హిట్ ప‌డేనా...!

అందాల రాక్ష‌సి చిత్రంతో   బాగా ఫేమ్ అయిన జోడి   న‌వీన్ చంద్ర‌,  లావ‌ణ్య త్రిపాఠి.   మంచి ప్ర‌మే క‌థ తో వ‌చ్చిన ఈ ఫిల్మ్ వీరిద్ద‌ర్ని అభిమానుల‌కు బాగా రీచ్ చేయ‌గ‌లిగింది కానీ..  న‌టులుగా వీరి కెరీర్ కు బూస్టింగ్ ఇవ్వలేక పోయింది.  అందాల రాక్ష‌సి చిత్రం త‌రువాత  న‌వీన్ చంద్ర   ద‌ళం,  రాజ‌కుమారుడు వంటి చిత్రాలు చేశాడు కానీ..  అవి పెద్ద‌గా వ‌ర్కువుట్ కాలేదు. లావ‌ణ్య త్రిపాఠి కూడా ఏవో ఒక‌టి రెండు చేసింది కానీ…ఆమేకు […]

ఈ సారైన  ఆ జంట‌కు హిట్ ప‌డేనా...!
X

అందాల రాక్ష‌సి చిత్రంతో బాగా ఫేమ్ అయిన జోడి న‌వీన్ చంద్ర‌, లావ‌ణ్య త్రిపాఠి. మంచి ప్ర‌మే క‌థ తో వ‌చ్చిన ఈ ఫిల్మ్ వీరిద్ద‌ర్ని అభిమానుల‌కు బాగా రీచ్ చేయ‌గ‌లిగింది కానీ.. న‌టులుగా వీరి కెరీర్ కు బూస్టింగ్ ఇవ్వలేక పోయింది. అందాల రాక్ష‌సి చిత్రం త‌రువాత న‌వీన్ చంద్ర ద‌ళం, రాజ‌కుమారుడు వంటి చిత్రాలు చేశాడు కానీ.. అవి పెద్ద‌గా వ‌ర్కువుట్ కాలేదు. లావ‌ణ్య త్రిపాఠి కూడా ఏవో ఒక‌టి రెండు చేసింది కానీ…ఆమేకు కెరీర్ ప‌రంగా మంచి బ్రేక్ రాలేదు.

క‌ట్ చేస్తే ఈ జోడి లేటెస్ట్ గా ల‌చ్చిమి దేవికి ఓ లెక్కుంది పేరు తో సినిమా చేశారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఒకింత వైవిధ్యంగా క‌నిపిస్తున్నారు. వినోదాత్మ‌కంగా చేసిన‌ట్లు తెలుస్తుంది. అయితే న‌వీన్ చంద్ర ఎంత వ‌ర‌కు కామెడి చేయ‌గ‌లిగి వుంటాడు అనేది ప్ర‌శ్నార్ధ‌క‌మే. ఎందుకంటే.. ద‌ళం వంటి చిత్రంలో చాల సీరియ‌స్ గా క‌నిపించాడు. ఆ తరువాత గ్లామ‌ర్ ఇమేజ్ కోసం చేసిన రాజ‌కుమారుడు పెద్ద‌గా వ‌ర్కువుట్ కాలేదు. మ‌రి ల‌చ్చిమి దేవి కి ఓ లెక్కుంది చిత్రం పూర్తి కామెడి పిల్మ్ లా అనిపిస్తుంది. నిజంగా న‌వీన్ చంద్ర కామెడి బాగా పండిస్తే.. ఆయ‌న తో పాటు హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి కి కూడా ల‌క్ చిక్కిన‌ట్లే మ‌రి.

Next Story