Telugu Global
Others

రెండు దేశాల కేసులూ స‌స్పెండ్ చేయండి 

భార‌త మ‌త్స్య‌కారుల హ‌త్య కేసులో ఇట‌లీ, భార‌త్‌ల మ‌ధ్య దౌత్య‌ప‌ర‌మైన అంశాలున్నందున‌ రెండుదేశాలూ త‌మ కేసుల‌ను  ఉప‌సంహ‌రించుకోవాల‌ని అంత‌ర్జాతీయ స‌ముద్ర ట్రిబ్యున‌ల్ వ్యాఖ్యానించింది. రెండు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగేందుకు వీలుగా కేసు విచార‌ణ‌ను రెండు రోజుల పాటు వాయిదా వేసింది. భార‌తకు చెందిన ఇద్ద‌రు మ‌త్స్య‌కారుల‌ను కేర‌ళ‌ తీరంలో ఇట‌లీకి చెందిన ఇద్ద‌రు మెరైన్‌ అధికారులు 2012లో హ‌త్య చేశారు. దీనిపై భార‌త అధికారులు కేసు న‌మోదు చేశారు. అయితే, ఈ హ‌త్య‌లు జ‌రిగింది అంత‌ర్జాతీయ […]

భార‌త మ‌త్స్య‌కారుల హ‌త్య కేసులో ఇట‌లీ, భార‌త్‌ల మ‌ధ్య దౌత్య‌ప‌ర‌మైన అంశాలున్నందున‌ రెండుదేశాలూ త‌మ కేసుల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని అంత‌ర్జాతీయ స‌ముద్ర ట్రిబ్యున‌ల్ వ్యాఖ్యానించింది. రెండు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగేందుకు వీలుగా కేసు విచార‌ణ‌ను రెండు రోజుల పాటు వాయిదా వేసింది. భార‌తకు చెందిన ఇద్ద‌రు మ‌త్స్య‌కారుల‌ను కేర‌ళ‌ తీరంలో ఇట‌లీకి చెందిన ఇద్ద‌రు మెరైన్‌ అధికారులు 2012లో హ‌త్య చేశారు. దీనిపై భార‌త అధికారులు కేసు న‌మోదు చేశారు. అయితే, ఈ హ‌త్య‌లు జ‌రిగింది అంత‌ర్జాతీయ స‌ముద్ర‌జ‌లాల్లో క‌నుక భార‌త్‌కు త‌మ అధికారుల‌ను విచారించే హ‌క్కు లేద‌ని ఇట‌లీ వాదించ‌డంతో అంత‌ర్జాతీయ స‌ముద్ర‌జ‌లాల ట్రిబ్యున‌ల్‌ను భార‌త్ ఆశ్ర‌యించింది. రెండు దేశాల మ‌ధ్య దౌత్య‌ప‌ర‌మైన సంబంధాలు ఉండ‌డంతో చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల్సిందిగా ట్రిబ్యున‌ల్ సూచించి రెండు రోజులపాటు గ‌డువు ఇచ్చింది.
First Published:  24 Aug 2015 1:06 PM GMT
Next Story