Telugu Global
Cinema & Entertainment

ప్రేమ మహేష్ తల్లిగా ఒప్పుకోలేదు...

శ్రీమంతుడు లాంటి బడా ప్రాజెక్టుల అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. అలాంటిది ఆ సినిమాలో నటించనని కరాఖండిగా చెప్పేసింది ఓ సీనియర్ నటి. ఆమె పేరు ప్రేమ. అవును.. అప్పుడెప్పుడో వచ్చిన ధర్మచక్రం, దేవి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రేమ.. శ్రీమంతుడు సినిమా ఆఫర్ ను వదులుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. ఓ న్యూస్ ఛానెల్ ఈమధ్య ప్రేమతో ప్రత్యేక ఇంటర్వ్యూని ప్రసారం చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా తెలుగులో మళ్లీ రీఎంట్రీ […]

ప్రేమ మహేష్ తల్లిగా ఒప్పుకోలేదు...
X
శ్రీమంతుడు లాంటి బడా ప్రాజెక్టుల అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. అలాంటిది ఆ సినిమాలో నటించనని కరాఖండిగా చెప్పేసింది ఓ సీనియర్ నటి. ఆమె పేరు ప్రేమ. అవును.. అప్పుడెప్పుడో వచ్చిన ధర్మచక్రం, దేవి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రేమ.. శ్రీమంతుడు సినిమా ఆఫర్ ను వదులుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. ఓ న్యూస్ ఛానెల్ ఈమధ్య ప్రేమతో ప్రత్యేక ఇంటర్వ్యూని ప్రసారం చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా తెలుగులో మళ్లీ రీఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానంగా ప్రేమ ఈ విషయాన్ని బయటపెట్టింది. శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్ బాబుకు తల్లిగా నటించమని దర్శకుడు కొరటాల శివ తనను కలిసిన విషయాన్ని ప్రేమ గుర్తుచేసుకుంది. కథ మొత్తం తను విన్నానని, అయితే సినిమాలో మహేష్ తల్లి పాత్రకు నటించే స్కోప్ పెద్దగా లేకపోవడం వల్లనే ఆ సినిమాలో చేసేందుకు తిరస్కరించానని చెప్పుకొచ్చింది. తను కచ్చితంగా తెలుగు లో రీఎంట్రీ ఇస్తానని, అయితే రీఎంట్రీ మూవీ మాత్రం చాలా గ్రాండ్ గా ఉండాలని కోరుకుంటోంది ప్రేమ.
First Published:  24 Aug 2015 7:03 PM GMT
Next Story