Telugu Global
Cinema & Entertainment

పవన్ సినిమాకు ముహూర్తం కుదిరింది

దాసరి నారాయణరావుతో కలిసి ఓ సినిమా చేస్తానని చాలా రోజుల కిందటే ప్రకటించాడు పవన్. దర్శకరత్న కూడా ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేశాడు. అయితే పవన్ ప్రాజెక్ట్ అంటే మాటలు కాదు.. అన్నీ కుదిరితే సెట్స్ పైకి వస్తుంది. అందుకే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కు దాదాపు ఏడాదికి పైగానే సమయం పడుతుంది. అయితే ఈసారి మాత్రం పవన్-దాసరి సినిమా పనులు శరవేగంగా పూర్తయినట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ ప్రాజెక్ట్ లోకి త్రివిక్రమ్ ఎంటరయ్యాడు. ఇప్పటికే పవన్ […]

పవన్ సినిమాకు ముహూర్తం కుదిరింది
X
దాసరి నారాయణరావుతో కలిసి ఓ సినిమా చేస్తానని చాలా రోజుల కిందటే ప్రకటించాడు పవన్. దర్శకరత్న కూడా ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేశాడు. అయితే పవన్ ప్రాజెక్ట్ అంటే మాటలు కాదు.. అన్నీ కుదిరితే సెట్స్ పైకి వస్తుంది. అందుకే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కు దాదాపు ఏడాదికి పైగానే సమయం పడుతుంది. అయితే ఈసారి మాత్రం పవన్-దాసరి సినిమా పనులు శరవేగంగా పూర్తయినట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ ప్రాజెక్ట్ లోకి త్రివిక్రమ్ ఎంటరయ్యాడు. ఇప్పటికే పవన్ కోసం ఓ స్టోరీలైన్ ప్రిపేర్ చేశాడు. ఆ కథ అటు పవన్ తో పాటు ఇటు దాసరికి కూడా బాగా నచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి నాటికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు పవన్. అయితే ఈ కథకు తానే దర్శకుడిగా వ్యవహరించడానికి త్రివిక్రమ్ సిద్ధంగా ఉంది. కాబట్టి గోపాల గోపాల దర్శకుడు డాలీ లేదా సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబిలో ఒకరికి ఈ కథను ఇచ్చి స్క్రీన్ ప్లేను రాయమని చెప్పే అవకాశముంది.
First Published:  24 Aug 2015 7:02 PM GMT
Next Story