ఏపీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
ఏపీలో మరో విద్యార్థిని అనుమానాస్పద మృతి స్థితిలో మృతి చెందింది. ఇదేనెలలో కడప జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తాము చదువుతున్న హాస్టల్లోనే అనుమానాస్పదస్థతిలో ఉరివేసుకుని మరణించిన ఘటన మరువకముందే మరో విద్యార్థిని బలవడం సంచలనం రేపుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్ణణం మహానాడుకు చెందిన సాయిశ్రావణి (18) విజయవాడలో బీకాం చదువుతోంది. ఆమె తండ్రి శ్రీనివాసరావు విజయవాడ ఆటోనగర్‌లో లారీ బాడీలు తయారుచేస్తాడు. ఈనెల 20న ఇంటి నుంచి కాలేజీకి వెళ్లిన సాయిశ్రావణి తిరిగి […]
BY sarvi24 Aug 2015 11:40 PM GMT
X
sarvi Updated On: 24 Aug 2015 11:40 PM GMT
ఏపీలో మరో విద్యార్థిని అనుమానాస్పద మృతి స్థితిలో మృతి చెందింది. ఇదేనెలలో కడప జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తాము చదువుతున్న హాస్టల్లోనే అనుమానాస్పదస్థతిలో ఉరివేసుకుని మరణించిన ఘటన మరువకముందే మరో విద్యార్థిని బలవడం సంచలనం రేపుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్ణణం మహానాడుకు చెందిన సాయిశ్రావణి (18) విజయవాడలో బీకాం చదువుతోంది. ఆమె తండ్రి శ్రీనివాసరావు విజయవాడ ఆటోనగర్‌లో లారీ బాడీలు తయారుచేస్తాడు. ఈనెల 20న ఇంటి నుంచి కాలేజీకి వెళ్లిన సాయిశ్రావణి తిరిగి రాలేదు. శ్రావణి ఇంటికి రాకపోవడంతో గాలించిన ఆమె కుటుంబ సభ్యులు సూర్యారావు పేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం తాడేపల్లి కనకదుర్గమ్మ బ్రిడ్జి వద్ద లభించిన మృతదేహం శ్రావణిదిగా పోలీసులు గుర్తించారు. శ్రావణి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఎవరో హత్య చేసి నదిలో విసిరేశారని ఆమె తండ్రి విలపిస్తూ తెలిపారు. తన కుమార్తె ఒంటిపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు, 2 సెల్‌ఫోన్లు కనిపించడం లేదని చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story