Telugu Global
Cinema & Entertainment

సమంతకు దర్శకుడి చెంపదెబ్బ!

చెప్పినట్టు చేయడానికి దర్శకులు ఒకప్పుడు హీరో, హీరోయిన్‌పై చేయి చేసుకునేవారు. తర్వాత మళ్ళీ మామూలు స్థితికి తేవడానికి వారిని బుజ్జిగించేవారు. కాని ఇపుడు ట్రెండ్‌ మారిపోయింది. వచ్చినంతవరకు చేయించుకోవడం… నచ్చినంత ఉంచుకోవడం… మెచ్చింది ప్రేక్షకులకు చూపించుకోవడం… ఇది ప్రస్తుత ట్రెండ్‌. సినిమాలన్నీ ఈ ట్రెండ్‌లోనే వెళుతున్నాయని అందరూ అనుకుంటారు. కాని తమిళంలో దీనికి భిన్నంగా జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంత, విక్రమ్‌ జంటగా నటిస్తున్న ’10 ఎన్రదుకుళ్ళ’ సినిమా షూటింగ్ సందర్భంగా సమంతకు దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ […]

సమంతకు దర్శకుడి చెంపదెబ్బ!
X
చెప్పినట్టు చేయడానికి దర్శకులు ఒకప్పుడు హీరో, హీరోయిన్‌పై చేయి చేసుకునేవారు. తర్వాత మళ్ళీ మామూలు స్థితికి తేవడానికి వారిని బుజ్జిగించేవారు. కాని ఇపుడు ట్రెండ్‌ మారిపోయింది. వచ్చినంతవరకు చేయించుకోవడం… నచ్చినంత ఉంచుకోవడం… మెచ్చింది ప్రేక్షకులకు చూపించుకోవడం… ఇది ప్రస్తుత ట్రెండ్‌. సినిమాలన్నీ ఈ ట్రెండ్‌లోనే వెళుతున్నాయని అందరూ అనుకుంటారు. కాని తమిళంలో దీనికి భిన్నంగా జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంత, విక్రమ్‌ జంటగా నటిస్తున్న ’10 ఎన్రదుకుళ్ళ’ సినిమా షూటింగ్ సందర్భంగా సమంతకు దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ చేయి తగిలిందట. కాని అది తగలడం కాదు… వాయించమేనని అక్కడున్నవారు చెవులు కొరుక్కున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా బయటకు వచ్చి ఇపుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దాంతో సమంత ఫ్యాన్స్‌ సదరు దర్శకుడిపై రుసరుసలాడుతున్నారు. దీనిపై సమంత మాత్రం ఇప్పటివరకు నోరు మెదపక పోవడం చర్చనీయాంశమవుతోంది.
First Published:  25 Aug 2015 1:00 AM GMT
Next Story