Telugu Global
Cinema & Entertainment

నంబర్-2 గా నిలిచిన పులి

విడుదలకు ముందే పులి సినిమా నంబర్-2గా నిలిచింది. విజయ్ హీరోగా, హన్సిక-శృతిహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఇండియాలో ఎక్కువమంది వీక్షకులు నెట్ లో చూసిన రెండో సినిమాగా నిలిచింది. తాజాగా విడుదలైన పులి ట్రయిలర్ ఈ ఘనత సొంత చేసుకుంది. సోసియో-ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రయిలర్ ను భాషతో సంబంధం లేకుండా ఇండియాలో ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. మరీ ముఖ్యంగా సౌత్ లో అతిలోకసుందరి రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ జనాలతో […]

నంబర్-2 గా నిలిచిన పులి
X
విడుదలకు ముందే పులి సినిమా నంబర్-2గా నిలిచింది. విజయ్ హీరోగా, హన్సిక-శృతిహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఇండియాలో ఎక్కువమంది వీక్షకులు నెట్ లో చూసిన రెండో సినిమాగా నిలిచింది. తాజాగా విడుదలైన పులి ట్రయిలర్ ఈ ఘనత సొంత చేసుకుంది. సోసియో-ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రయిలర్ ను భాషతో సంబంధం లేకుండా ఇండియాలో ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. మరీ ముఖ్యంగా సౌత్ లో అతిలోకసుందరి రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ జనాలతో పాటు ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా ఎక్కువగా పులి ట్రయిలర్ ను వీక్షిస్తున్నారు. దీంతో సల్మాన్ నటించిన కిక్-2 సినిమా తర్వాత అత్యధిక హిట్స్ దక్కించుకున్న సినిమాగా పులి నిలిచింది. ప్రస్తుతానికైతే ఈ సినిమా ట్రయిలర్ ను 30లక్షల 40వేల మంది చూశారు. ఫేస్ బుక్ లో 76వేల లైక్స్ వచ్చాయి. విడుదల తర్వాత పులి సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.
First Published:  23 Aug 2015 7:00 PM GMT
Next Story