Telugu Global
Cinema & Entertainment

సెప్టెంబర్ 4న పేలనుంది

మంచు విష్ణు తాజా చిత్రం డైనమేట్. ఈ సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయాలని అనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాను వచ్చేనెల మూడోవారంలో విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రుద్రమదేవి సినిమా సెప్టెంబర్ 4న వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే గ్రాఫిక్స్ డిలే కారణంగా రుద్రమదేవి రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. మరో 3 వారాల పాటు ఆ సినిమా థియేటర్లలోకి రాదు. దీంతో రుద్రమదేవిని విడుదల చేయాల్సిన సెప్టెంబర్ […]

సెప్టెంబర్ 4న పేలనుంది
X
మంచు విష్ణు తాజా చిత్రం డైనమేట్. ఈ సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయాలని అనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాను వచ్చేనెల మూడోవారంలో విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రుద్రమదేవి సినిమా సెప్టెంబర్ 4న వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే గ్రాఫిక్స్ డిలే కారణంగా రుద్రమదేవి రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. మరో 3 వారాల పాటు ఆ సినిమా థియేటర్లలోకి రాదు. దీంతో రుద్రమదేవిని విడుదల చేయాల్సిన సెప్టెంబర్ 4 తేదీని డైనమేట్ ఆక్రమించింది. అలా కాస్త ముందుగానే విష్ణు సినిమా థియేటర్లలోకి రాబోతోంది. దేవ్ కట్టా డైరక్ట్ చేసిన ఈ సినిమాలో విష్ణు సరసన ప్రణీత హీరోయిన్ గా నటిస్తోంది. తన సొంత బ్యానర్ పై విష్ణునే ఈ సినిమాను నిర్మించాడు. తమిళ్ లో సూపర్ హిట్టయిన ఓ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న డైనమేట్ లో జేడీ చక్రవర్తి విలన్ గా నటిస్తున్నాడు.
Next Story