Telugu Global
Cinema & Entertainment

అభిషేక్ ను మించిపోయిన మాస్ రాజా

మాస్ రాజా రవితేజ ఇప్పుడు ఆలిండియా లెవెల్లో పాపులర్ అయిపోయాడు. ఏకంగా బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నే క్రాస్ చేశాడు. తాజాగా ఈ రికార్డును అందుకున్నాడు రవితేజ. మాస్ రాజా రవితేజ నటించిన కిక్-2, హిందీలో అభిషేక్ బచ్చన్ నటించిన ఆల్ ఈజ్ వెల్ సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. అయితే గూగుల్ మోస్ట్ సెర్చ్ లిస్ట్ లో మాత్రం అభిషేక్ నటించిన ఆల్ ఈజ్ వెల్ సినిమా కంటే కిక్-2కే ఎక్కువ హిట్స్ పడ్డాయి. శుక్రవారం, […]

అభిషేక్ ను మించిపోయిన మాస్ రాజా
X

మాస్ రాజా రవితేజ ఇప్పుడు ఆలిండియా లెవెల్లో పాపులర్ అయిపోయాడు. ఏకంగా బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నే క్రాస్ చేశాడు. తాజాగా ఈ రికార్డును అందుకున్నాడు రవితేజ. మాస్ రాజా రవితేజ నటించిన కిక్-2, హిందీలో అభిషేక్ బచ్చన్ నటించిన ఆల్ ఈజ్ వెల్ సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. అయితే గూగుల్ మోస్ట్ సెర్చ్ లిస్ట్ లో మాత్రం అభిషేక్ నటించిన ఆల్ ఈజ్ వెల్ సినిమా కంటే కిక్-2కే ఎక్కువ హిట్స్ పడ్డాయి. శుక్రవారం, శనివారం కలుపుకుంటే గూగుల్ లో ఎక్కువ మంది అభిషేక్ కంటే.. మాస్ రాజా సినిమాపైనే ఆసక్తి చూపించారు. దీంతో ఆన్ లైన్ లో అభిషేక్ ను డామినేట్ చేశాడు రవితేజ. నిజజీవితంలో రవితేజ, అమితాబ్ బచ్చన్ కు వీరాభిమాని. రవితేజ ఆరాధ్య దైవమైన బిగ్ బి కొడుకునే మాస్ రాజా అధిగమించడాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా గొప్పగా చెప్పుకున్నారు. మరో వైపు కిక్-2 సినిమాకు శనివారం కూడా బ్రహ్మాండమైన వసూళ్లు వచ్చాయి. సినిమాకు మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ.. వీకెండ్ కావడంతో వసూళ్లు మాత్రం తగ్గలేదు.

First Published:  23 Aug 2015 6:00 AM GMT
Next Story