Telugu Global
Cinema & Entertainment

మహేష్ పాటతో నాగచైతన్య సినిమా

తెలుగు పాపులర్ పాటలు సినిమా టైటిల్స్ గా మారడం కొత్తేంకాదు. ఎప్పట్నుంచి ఉన్నదే. కాకపోతే ఓ బడా హీరో సూపర్ హిట్ సాంగ్ ను, మరో బడా హీరో ఎప్పుడూ ఇలా వాడుకోలేదు. స్టార్ హీరోల సాంగ్స్ ను చిన్న హీరోలు మాత్రమే ఇలా వాడుకుంటూ వచ్చారు. ఈ సారి మాత్రం ఆ స్టయిల్ మారింది. మహేష్ నటించిన ఒక్కడు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ను ఈసారి నాగచైతన్య వాడుకోవడానికి సిద్ధమయ్యాడు. తన కొత్త సినిమాకు […]

మహేష్ పాటతో నాగచైతన్య సినిమా
X

తెలుగు పాపులర్ పాటలు సినిమా టైటిల్స్ గా మారడం కొత్తేంకాదు. ఎప్పట్నుంచి ఉన్నదే. కాకపోతే ఓ బడా హీరో సూపర్ హిట్ సాంగ్ ను, మరో బడా హీరో ఎప్పుడూ ఇలా వాడుకోలేదు. స్టార్ హీరోల సాంగ్స్ ను చిన్న హీరోలు మాత్రమే ఇలా వాడుకుంటూ వచ్చారు. ఈ సారి మాత్రం ఆ స్టయిల్ మారింది. మహేష్ నటించిన ఒక్కడు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ను ఈసారి నాగచైతన్య వాడుకోవడానికి సిద్ధమయ్యాడు. తన కొత్త సినిమాకు సాహసం శ్వాసగా సాగిపో అనే టైటిల్ ను అనుకుంటున్నాడు. ఒక్కడులో మహేష్ బాబు భూమికను రక్షించే క్రమంలో ఈ పాట వస్తుంది. ఈ పాటలోని తొలి మూడు పదాల్ని తన కొత్త సినిమాకు టైటిల్ గా పెట్టే ఆలోచనలో ఉన్నాడు నాగచైతన్య. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు చైతూ. కథ ప్రకారం ఈ సినిమాకు సాహసం శ్వాసగా సాగిపో అనే టైటిల్ పెడితే బాగుంటుందని సినిమా యూనిట్ భావిస్తోంది. తెలుగులో ఇంకా ఆ టైటిల్ ఫిక్స్ చేయనప్పటికీ.. శింబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా తమిళ వెర్షన్ కు మాత్రం అప్పుడే ఈ టైటిల్ పెట్టేశాడు. రెహ్మాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  22 Aug 2015 8:03 PM GMT
Next Story