Telugu Global
Cinema & Entertainment

మహేష్ థాయిలాండ్ కు జంప్

తన ప్రతి సినిమా పూర్తయిన వెంటనే విహార యాత్ర ప్లాన్ చేయడ మహేష్ కు అలవాడు. వన్-నేనొక్కడినే సినిమా సమయంలో మాత్రమే మహేష్, తన వెకేషన్ ను బ్రేక్ చేసుకున్నాడు. మిగతా అన్ని సినిమాల విషయంలో మాత్రం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు శ్రీమంతుడు సక్సెస్ తర్వాత కూడా మహేష్ తన పాత స్టయిల్ నే కొనసాగిస్తున్నాడు. శ్రీమంతుడు సినిమా సక్సెస్ అవ్వడంతో పాటు సక్సెస్ మీట్ కూడా ఘనంగా నిర్వహించుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి […]

మహేష్ థాయిలాండ్ కు జంప్
X

తన ప్రతి సినిమా పూర్తయిన వెంటనే విహార యాత్ర ప్లాన్ చేయడ మహేష్ కు అలవాడు. వన్-నేనొక్కడినే సినిమా సమయంలో మాత్రమే మహేష్, తన వెకేషన్ ను బ్రేక్ చేసుకున్నాడు. మిగతా అన్ని సినిమాల విషయంలో మాత్రం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు శ్రీమంతుడు సక్సెస్ తర్వాత కూడా మహేష్ తన పాత స్టయిల్ నే కొనసాగిస్తున్నాడు. శ్రీమంతుడు సినిమా సక్సెస్ అవ్వడంతో పాటు సక్సెస్ మీట్ కూడా ఘనంగా నిర్వహించుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి మహేష్ చేయాల్సింది ఇంకేం లేదు. అందుకే ఇక శ్రీమంతుడితో కనెక్షన్ కట్ చేసుకున్నాడు ప్రిన్స్. తన కుటుంబంతో పాటు థాయిలాండ్ చెక్కేశాడు. భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ తో పాటు మహేష్ ఫ్లయిట్ ఎక్కేశాడు. కొన్ని రోజుల పాటు థాయిలాండ్ లో రిలాక్స్ అయి, కుటుంబసభ్యులతో పాటు ఎంజాయ్ చేసిన తర్వాత హైదరాబాద్ తిరిగొస్తాడు ప్రిన్స్. మహేష్ హైదరాబాద్ ఎప్పుడొస్తాడనే విషయం తెలియనప్పటికీ, అతడు వచ్చిన వెంటనే బ్రహ్మోత్సవం షూటింగ్ మాత్రం మొదలవుతుంది. ఈసారి బ్రహ్మోత్సవం కోసం గంపగుత్తగా కొన్ని నెలల పాటు కాల్షీట్లు ఇచ్చేశాడు మహేష్. ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే టార్గెట్ తో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

First Published:  22 Aug 2015 8:10 PM GMT
Next Story