Telugu Global
Others

జ‌పాన్ జీవ‌నశైలికి జై కొట్టాల్సిందే!

ఇటీవ‌ల ప్ర‌పంచంలోనే అత్యంత వృద్ధుడైన 116 సంవ‌త్స‌రాల వ్య‌క్తి మ‌ర‌ణించాడు. ఆయ‌న జ‌పాన్ పౌరుడు. ఆయ‌న త‌న తొంభై సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌ర‌కు ప‌నిచేస్తూనే ఉన్నాడు. ఆయ‌నే కాదు, జ‌పాన్ పౌరులు ఎక్కువ కాలం జీవించ‌డంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఇక ఇక్క‌డి మ‌హిళ‌ల‌యితే గ‌త పాతిక సంవ‌త్స‌రాలుగా ఇత‌ర దేశాల మ‌హిళ‌ల కంటే  అద‌నపు స‌గ‌టు జీవిత‌కాలంతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.   2010లో వీరి స‌గ‌టు జీవిత కాలం 86.3 సంవ‌త్స‌రాలుగా ఉంది. 2011లో ఒక్కసారి మాత్ర‌మే […]

జ‌పాన్ జీవ‌నశైలికి జై కొట్టాల్సిందే!
X

ఇటీవ‌ల ప్ర‌పంచంలోనే అత్యంత వృద్ధుడైన 116 సంవ‌త్స‌రాల వ్య‌క్తి మ‌ర‌ణించాడు. ఆయ‌న జ‌పాన్ పౌరుడు. ఆయ‌న త‌న తొంభై సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌ర‌కు ప‌నిచేస్తూనే ఉన్నాడు. ఆయ‌నే కాదు, జ‌పాన్ పౌరులు ఎక్కువ కాలం జీవించ‌డంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఇక ఇక్క‌డి మ‌హిళ‌ల‌యితే గ‌త పాతిక సంవ‌త్స‌రాలుగా ఇత‌ర దేశాల మ‌హిళ‌ల కంటే అద‌నపు స‌గ‌టు జీవిత‌కాలంతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2010లో వీరి స‌గ‌టు జీవిత కాలం 86.3 సంవ‌త్స‌రాలుగా ఉంది. 2011లో ఒక్కసారి మాత్ర‌మే 85.9కి త‌గ్గి హాంకాంగ్ కి మొద‌టి స్థానం ఇచ్చి రెండోస్థానానికి వెళ్లారు ఈ మ‌హిళ‌లు. ఇందుకు కార‌ణం 2011 మార్చిలో వ‌చ్చిన సునామీ. ఇక ఇక్క‌డి మ‌గ‌వారి స‌గ‌టు జీవిత కాలం 79.4 సంవ‌త్స‌రాలు. ఇది మ‌హిళ‌ల కంటే త‌క్కువే అయినా ఇత‌ర దేశాల మ‌గ‌వారితో పోలిస్తే ఇది ఎక్కువే. ప్ర‌స్తుతం జ‌పాన్ జీవ‌న కాలం విష‌యంలో 84.46 స‌గ‌టుతో ప్ర‌పంచంలో మూడో స్థానంలో ఉంది. దాని ముందు మొనాకో, మ‌కావ్‌ ఉన్నాయి. ఈ విష‌యంలో 67.80 స‌గటు జీవిత‌కాలంతో ప్ర‌పంచ‌దేశాల్లో 163వ స్థానంలో ఉన్న మనం, జ‌పాన్‌ ప‌నిరాక్ష‌సులు అంత ఎక్కువ‌కాలం ఎలా జీవిస్తున్నారో తెలుసుకుని తీరాల్సిందే-

  • వీరు త‌మ‌దైన సాంప్ర‌దాయ ఆహారానికి ప్రాధాన్య‌త ఇస్తారు. చేప‌లు, వ‌రిఅన్నం, ఉడికించిన కూర‌గాయ‌లు ఎక్కువ‌గా తీసుకుంటారు. వైద్య స‌దుపాయం తేలిగ్గా అందుబాటులో ఉంటుంది. ఇవ‌న్నీ కాకుండా వృద్ధుల ప‌ట్ల ఇక్క‌డ శ్ర‌ద్ధ ఎక్కువ‌గా ఉంటుంది. ఇవ‌న్నీ క‌లిసి వారి జీవిత‌కాలాన్ని పెంచుతున్నాయి.
  • ముఖ్యంగా తాజా ఆహారానికి ప్రాధాన్య‌త ఇస్తారు. సోయాబీన్స్ తో త‌యార‌యిన తోఫు అనే కొలెస్ట్రాల్ లేని పెరుగుని వాడ‌తారు. ఇందులో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.
  • వేల సంవ‌త్స‌రాలుగా చైనావారు ఔష‌ధాల్లో వాడుతున్న షీటేక్ పుట్ట‌గొడుగుల‌ను జ‌పాన్ వారు ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. వీటిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గానూ, కొవ్వు త‌క్కువ‌గానూ ఉంటుంది.
  • ఉప్పు ఎక్కువ వాడాల్సిన వంట‌కాలు చేప‌ల వేపుడు, నిల‌వ ప‌చ్చ‌ళ్లు, సోయాసాస్ లాంటివాటిని బాగానే తీసుకుంటారు. అక్క‌డి మ‌గ‌వారు స్మోకింగ్ కూడా ఎక్కువే చేస్తారు. ప్ర‌తి ముగ్గురిలో ఒకరు పొగ‌తాగుతారు. ఆల్క‌హాల్ సంబంధింత పానీయాలు సైతం ఎక్కువే తీసుకుంటారు. అయితే వారిలో ఒబేసిటీ స‌మ‌స్య అనేది క‌నిపించ‌దు. 80శాతం పొట్ట‌నిండ‌గానే తిన‌డం ఆపేయ‌మ‌నే ఒక జ‌ప‌నీస్ ఆరోగ్య సూక్తిని వారు బాగా పాటిస్తారు.
  • రెండేళ్ల క్రితం టోక్యో ప్రొఫెస‌ర్ ఒక‌రు జ‌పాన్ ప్ర‌జ‌ల జీవిత‌కాలం మీద అధ్య‌య‌నం చేశారు. ఆయ‌న వెల్ల‌డించిన విష‌యాల్లో ముఖ్య‌మైన‌ది జ‌పాన్ ప్ర‌జ‌లు శుభ్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తారు. ఈ మ‌న‌స్త‌త్వం వారి జీవితాల్లోని అన్ని కోణాల‌మీద మంచి ప్ర‌భావాన్ని చూపుతోంది. విద్య, సంస్కృతి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, కాలుష్య‌నివార‌ణ వీట‌న్నింటిపై శుభ్ర‌త ప‌ట్ల వారికున్న శ్ర‌ద్ధ ప్ర‌భావం చూపుతోంద‌ని ఆయ‌న అధ్య‌య‌నంలో తేలింది. అక్క‌డ షింటో అనే సంప్ర‌దాయం ఉంది. దీని ప్ర‌కారం ఇత‌రుల‌ను క‌లిసే ముందు శ‌రీరం, మ‌న‌సు శుచిగా ఉండాల‌ని జ‌పాన్‌వారు న‌మ్ముతారు.
  • వీరిలో ఆరోగ్య స్పృహ ఎక్కువగా ఉంటుంది. సాధార‌ణ ఆరోగ్య ప‌రీక్ష‌లు నిరంత‌రం జ‌రుగుతుంటాయి. పాఠ‌శాలల్లోనూ, ప‌నిప్ర‌దేశాల్లోనూ ఇలాంటి స‌దుపాయాలు ఉంటాయి.ఇవి కాకుండా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్ర‌భుత్వాలు సైతం ఈ సౌక‌ర్యాలు క‌ల్పిస్తాయి. ఇక్కడి ప్ర‌భుత్వాలు ఆర్థిక అభివృద్ధితో పాటు ప్ర‌జ‌ల ఆరోగ్య‌ ప్ర‌మాణాన్ని పెంచ‌డంలో చ‌ర్య‌లు తీసుకుంటాయి.
  • ఇవ‌న్నీ కాకుండా జ‌పాన్‌కి తైవాన్‌కి మ‌ధ్య ఉన్న‌ ద్వీప ప్రాంతాల్లో నివ‌సిస్తున్న‌వారు మ‌రింత‌ఎక్కువ కాలం జీవిస్తున్న‌ట్టుగా ప‌రిశోధ‌కులు తేల్చారు. వీరిలో గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌లు త‌క్కువ ఉన్నాయి. వీరిలో త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న జ‌న్యు ల‌క్ష‌ణాలు ప‌లుర‌కాల వ్యాధుల‌ను రాకుండా నివారిస్తున్న‌ట్టుగా ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు.
  • మొత్తానికి చురుకైన జీవ‌న శైలి, ఆరోగ్య క‌ర‌మైన తాజాఆహారం, ప‌రిశుభ్ర‌త‌, క‌డుపునిండా తిన‌క‌పోవ‌డం ఇవే జ‌పాన్ ప్ర‌జ‌ల ఆరోగ్య‌ర‌హ‌స్యాలుగా తెలుస్తోంది.
First Published:  23 Aug 2015 5:53 AM GMT
Next Story