Telugu Global
Cinema & Entertainment

కామ్ గా గోపీచంద్ కొత్త సినిమా

గతేడాది నుంచి వరుసగా విజయాలందుకుంటున్నాడు గోపీచంద్. లౌక్యంతో మంచి సక్సెస్ సాధించాడు. ఈ ఏడాది జిల్ తో మైమరిపించాడు. ఇప్పుడు వరుసగా మూడో విజయం అందుకొని హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమౌతున్నాడు. ఎలాంటి అంచనాలు పెంచకూడదనే ఉద్దేశంతో తన హ్యాట్రిక్ మూవీని ప్రచారానికి దూరంగా, కామ్ గా తెరకెక్కిస్తున్నాడు గోపీచంద్. రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టనప్పటికీ షూటింగ్ మాత్రం శరవేగంగా నడుస్తోంది. యజ్ఞం లాంటి సూపర్ హిట్ తర్వాత రవికుమార్ చౌదరి, […]

కామ్ గా గోపీచంద్ కొత్త సినిమా
X
గతేడాది నుంచి వరుసగా విజయాలందుకుంటున్నాడు గోపీచంద్. లౌక్యంతో మంచి సక్సెస్ సాధించాడు. ఈ ఏడాది జిల్ తో మైమరిపించాడు. ఇప్పుడు వరుసగా మూడో విజయం అందుకొని హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమౌతున్నాడు. ఎలాంటి అంచనాలు పెంచకూడదనే ఉద్దేశంతో తన హ్యాట్రిక్ మూవీని ప్రచారానికి దూరంగా, కామ్ గా తెరకెక్కిస్తున్నాడు గోపీచంద్. రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టనప్పటికీ షూటింగ్ మాత్రం శరవేగంగా నడుస్తోంది. యజ్ఞం లాంటి సూపర్ హిట్ తర్వాత రవికుమార్ చౌదరి, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా ఇదే. దీంతో అంచనాలు కాస్త పెరిగాయి. ఈ ఎక్స్ పెక్టేషన్స్ ను మరింత పెంచకూడదనే ఉద్దేశంతోనే సినిమా షూటింగ్ ను గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గోపీచంద్-రెజీనా మధ్య ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ కథతో వస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Next Story