Telugu Global
Others

అప్పులబాధతో నలుగురు యువ రైతులు బలి

వ్యవసాయం సాగక.. అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం లేక పాలమూరు జిల్లాలో రైతులు బలవనర్మరణాలకు పాల్పడుతున్నారు. శనివారం ఒక్క రోజే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ముగ్గురు మూడు పదులు కూడా నిండని యువరైతులు కావడం విషాదం. అమ్రాబాద్‌ మండలం వటువర్లపల్లికి చెందిన వెంకటయ్య(26), ఉప్పునుంతల మండలం సదగోడు గ్రామానికి చెందిన రైతు గడ్డి శ్రీనివాసులు(24), బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామానికి చెందిన మహిళా రైతు జి.మల్లీశ్వరి(28), బొంరా్‌సపేట్‌ మండలం హకీంపేట్‌కు చెందిన రైతు […]

వ్యవసాయం సాగక.. అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం లేక పాలమూరు జిల్లాలో రైతులు బలవనర్మరణాలకు పాల్పడుతున్నారు. శనివారం ఒక్క రోజే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ముగ్గురు మూడు పదులు కూడా నిండని యువరైతులు కావడం విషాదం. అమ్రాబాద్‌ మండలం వటువర్లపల్లికి చెందిన వెంకటయ్య(26), ఉప్పునుంతల మండలం సదగోడు గ్రామానికి చెందిన రైతు గడ్డి శ్రీనివాసులు(24), బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామానికి చెందిన మహిళా రైతు జి.మల్లీశ్వరి(28), బొంరా్‌సపేట్‌ మండలం హకీంపేట్‌కు చెందిన రైతు ఎర్ర బసప్ప(48) బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక వీరంతా ఆత్మహత్యలు చేసుకున్నట్టు తెలుస్తోంది.
First Published:  22 Aug 2015 1:10 PM GMT
Next Story