Telugu Global
Cinema & Entertainment

కంఫర్ట్ కోసం 11 నిమిషాలు కట్...

భారీ అంచనాల మధ్య విడుదలైన కిక్-2 సినిమా ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. నిజానికి మొదటి రోజు మొదటి ఆట నుంచే సినిమాకు నెగెటివ్ టాక్ మొదలైంది. సీక్వెల్స్ తెలుగులో హిట్టవ్వవనే నానుడికి మరింత బలం చేకూర్చే దిశగా కిక్-2 ప్రయాణం సాగుతోంది. ఇలాంటి సమయంలో వెంటనే రియాక్ట్ అయింది సినిమా యూనిట్. ప్రేక్షకులు ఎక్కడ బోర్ ఫీలవుతున్నానే అంశంపై ఓ అవగాహనకు వచ్చింది. ఆ మేరకు 11 నిమిషాల నిడివిని సినిమా నుంచి తొలిగించేశారు. కట్ […]

కంఫర్ట్ కోసం 11 నిమిషాలు కట్...
X

భారీ అంచనాల మధ్య విడుదలైన కిక్-2 సినిమా ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. నిజానికి మొదటి రోజు మొదటి ఆట నుంచే సినిమాకు నెగెటివ్ టాక్ మొదలైంది. సీక్వెల్స్ తెలుగులో హిట్టవ్వవనే నానుడికి మరింత బలం చేకూర్చే దిశగా కిక్-2 ప్రయాణం సాగుతోంది. ఇలాంటి సమయంలో వెంటనే రియాక్ట్ అయింది సినిమా యూనిట్. ప్రేక్షకులు ఎక్కడ బోర్ ఫీలవుతున్నానే అంశంపై ఓ అవగాహనకు వచ్చింది. ఆ మేరకు 11 నిమిషాల నిడివిని సినిమా నుంచి తొలిగించేశారు. కట్ చేసిన సినిమాను ఈరోజు నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తారు. కిక్-2 సినిమాకు సంబంధించి ఫస్టాఫ్ సూపర్ గా ఉందనే టాక్ ఉంది. కానీ సెకెండాఫ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే వాళ్లు ఎక్కువయ్యారు. ఈ కామెంట్స్ ను పరిగణనలోకి తీసుకున్న సినిమా యూనిట్, సెకెండాఫ్ నుంచే ఏకంగా 11 నిమిషాల సీన్లను తీసి పడేసింది. ఇప్పుడు సినిమాను మరింత ట్రిమ్ చేసి క్రిస్పీగా ప్రేక్షకులకు అందిస్తోంది. మరి కట్ చేసిన తర్వాత జనాలకు ఏమైనా కిక్ ఉంటుందా అనేది కొన్ని రోజుల తర్వాత తేలుతుంది.

First Published:  22 Aug 2015 8:06 PM GMT
Next Story