Telugu Global
NEWS

టీచర్ రాక్షసత్వం... విద్యార్థికి పక్షవాతం

కృష్ణా జిల్లాలోని గొడవర్రులో దారుణం జరిగింది. ఓ మాస్టర్‌ రాక్షసత్వం బయటపడింది. గొడవర్రు జిల్లా పరిషత్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇంటూరి చింటూ అనే విద్యార్థిని అల్లరి చేస్తున్నాడని టీచర్‌ మెడపై కొట్టాడు. దీంతో మెడనరాలు దెబ్బతిని బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అంతేకాదు… విద్యార్థికి మాట పడిపోయింది. కాళ్ళు, చేతులు పక్షవాతానికి గురయ్యాయి. దినసరి కూలీగా బతికే చింటూ తండ్రి రామయ్య ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే… టీచర్‌ తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. చికిత్సకు […]

టీచర్ రాక్షసత్వం... విద్యార్థికి పక్షవాతం
X
కృష్ణా జిల్లాలోని గొడవర్రులో దారుణం జరిగింది. ఓ మాస్టర్‌ రాక్షసత్వం బయటపడింది. గొడవర్రు జిల్లా పరిషత్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇంటూరి చింటూ అనే విద్యార్థిని అల్లరి చేస్తున్నాడని టీచర్‌ మెడపై కొట్టాడు. దీంతో మెడనరాలు దెబ్బతిని బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అంతేకాదు… విద్యార్థికి మాట పడిపోయింది. కాళ్ళు, చేతులు పక్షవాతానికి గురయ్యాయి. దినసరి కూలీగా బతికే చింటూ తండ్రి రామయ్య ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే… టీచర్‌ తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. చికిత్సకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని అంగీకరించాడు. అప్పటి వరకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న చింటూని మంచి వైద్యం కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో టీచర్‌ సుధాకర్‌ పెళ్ళాంబిడ్డలతో ఊరు నుంచి పారిపోయాడు. ప్రయివేటు ఆస్పత్రిలో 80 వేల ఖర్చయ్యింది. ఉన్న ఒక గేదెను అమ్మేసి వైద్యం కోసం ఖర్చుపెట్టిన రామయ్య తర్వాత ఖర్చులకు పొలాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. ఇక తనవద్ద పైసా కూడా లేదని, ఎలా వైద్యం చేయించాలో అర్ధంకావడం లేదని గొల్లుమంటున్నాడు. ఊరిలో వాళ్ళు కూడా కొంత సాయం చేశారు. ఇక తప్పని పరిస్థితిలో మళ్ళీ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికే చింటూని తరలించారు. అక్కడ వైద్యులు కూడా హైదరాబాద్‌ తీసుకెళితే మెరుగైన వైద్యం లభిస్తుందని సలహా ఇచ్చారు. బాలుడి ఆరోగ్యం మెరుగుపడిందని.. తమను గుర్తుపడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయని.. టీచరే తమ కొడుకు వైద్య ఖర్చులను భరించాలంటున్నారు. టీచర్‌ను శిక్షించాలని చెబుతున్నారు. కంకిపాడు పోలీసులు టీచర్ సుధాకర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
First Published:  22 Aug 2015 5:56 AM GMT
Next Story