Telugu Global
Cinema & Entertainment

నానీ ముందుకు... అనుష్క వెనక్కి..

 అనుష్క లీడ్ రోల్ లో గుణ‌శేఖ‌ర్ చేసిన రాణిరుద్ర‌మ చిత్రం   ప‌క్క గా   వచ్చెనెల 4 వ తేదిన  విడుద‌ల అవుతుందిన అభిమానులు ఆశించారు.  క‌న్ఫ్యూజ‌న్  వుండ‌కూడ‌ద‌నే ప్రెస్ మీట్ పెట్టి  మ‌రి గుణ‌శేఖ‌ర్   సెప్టెంబ‌ర్ 4 న రిలీజ్ అవుతున్న‌ట్లు చెప్పేశారు. కానీ. ఈ చిత్రం విజువ‌ల్ ఎఫెక్ట్స్  ప‌నులు ఇంకా పూర్తిగా కాలేద‌ని.. సెప్టెంబ‌ర్ 4 లోపు కంప్లీట్ కావ‌డం క‌ష్ట‌మేన‌ని తెలుస్తుంది. ఈ కార‌ణంగా రాణిరుద్ర‌మ సినిమా  మ‌రోసారి  వాయిద ప‌డే అవ‌కాశాలు […]

నానీ ముందుకు... అనుష్క వెనక్కి..
X

అనుష్క లీడ్ రోల్ లో గుణ‌శేఖ‌ర్ చేసిన రాణిరుద్ర‌మ చిత్రం ప‌క్క గా వచ్చెనెల 4 వ తేదిన విడుద‌ల అవుతుందిన అభిమానులు ఆశించారు. క‌న్ఫ్యూజ‌న్ వుండ‌కూడ‌ద‌నే ప్రెస్ మీట్ పెట్టి మ‌రి గుణ‌శేఖ‌ర్ సెప్టెంబ‌ర్ 4 న రిలీజ్ అవుతున్న‌ట్లు చెప్పేశారు. కానీ. ఈ చిత్రం విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌నులు ఇంకా పూర్తిగా కాలేద‌ని.. సెప్టెంబ‌ర్ 4 లోపు కంప్లీట్ కావ‌డం క‌ష్ట‌మేన‌ని తెలుస్తుంది. ఈ కార‌ణంగా రాణిరుద్ర‌మ సినిమా మ‌రోసారి వాయిద ప‌డే అవ‌కాశాలు ఎక్కువుగా వున్నాయంటున్నారు ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు.

ఇక ఈ చిత్రం వాయిద ప‌డే అవ‌కాశం వుండటంతో.. హీరో నాని న‌టించిన భ‌లే భ‌లే మ‌గాడివోయి చిత్రం ఆ తేదిన రిలీజ్ చేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. బ‌న్నీ వాసు నిర్మాత‌గా చేసిన ఈ చిత్రం హండ్రెట్ ప‌ర్సెంట్ కామెడి వుంటుంద‌ని భ‌రోసా ఇస్తున్నారు. యువి క్రియేష‌న్స్ పై ఈ చిత్రం వ‌స్తుంది. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేసింది. ఆరోగ్యక‌ర‌మైన వినోదం వుంటుందంటున్నారు చిత్ర యూనిట్.

Next Story