Telugu Global
Cinema & Entertainment

చెర్రి టీజర్‌ అదిరిపోయింది

చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుక కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూశారో.. సేమ్ టైం చిరు తనయుడు చరణ్ కొత్త సినిమా టీజర్ కోసం కూడా అదేస్థాయిలో వేచిచూశారు. ఎట్టకేలకు ఆ ముహూర్తం రానే వచ్చింది. చిరు బర్త్ డే కానుకగా రామ్ చరణ్ కొత్త సినిమా టీజర్ విడుదలైంది. శ్రీనువైట్ల మార్క్, మెగాపవర్ స్టార్ ఇమేజ్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ చెర్రీ కొత్త సినిమా టీజర్ పవర్ ప్యాక్డ్ గా రూపుదిద్దుకుంది. టీజర్ చూస్తేనే అర్థమౌతోంది ఇదొక […]

చెర్రి టీజర్‌ అదిరిపోయింది
X
చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుక కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూశారో.. సేమ్ టైం చిరు తనయుడు చరణ్ కొత్త సినిమా టీజర్ కోసం కూడా అదేస్థాయిలో వేచిచూశారు. ఎట్టకేలకు ఆ ముహూర్తం రానే వచ్చింది. చిరు బర్త్ డే కానుకగా రామ్ చరణ్ కొత్త సినిమా టీజర్ విడుదలైంది. శ్రీనువైట్ల మార్క్, మెగాపవర్ స్టార్ ఇమేజ్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ చెర్రీ కొత్త సినిమా టీజర్ పవర్ ప్యాక్డ్ గా రూపుదిద్దుకుంది. టీజర్ చూస్తేనే అర్థమౌతోంది ఇదొక యాక్షన్ సినిమా అని. ఇప్పటికే యాక్షన్ మూవీస్ తో ఇరగదీసిన చెర్రీ.. శ్రీనువైట్ల డైరక్షన్ లో మరింత పవర్ ఫుల్ గా కనిపించాడు. ఇక శ్రీనువైట్ల తరహా పంచ్ డైలాగ్ ను కూడా టీజర్ లో పెట్టారు. నీ మీటర్ పగిలితే కానీ నా మేటర్ అర్థం కాదు లాంటి పంచ్ డైలాగులు టీజర్ తో చొప్పించారు. మొత్తమ్మీద టీజర్ తో సినిమాకు బ్రహ్మాండమైన హైప్ తీసుకొచ్చాడు రామ్ చరణ్. మరీ ముఖ్యంగా తండ్రి పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. కానీ సినిమా పేరును మాత్రం ఎనౌన్స్ చేయకపోవడాన్ని మెగాభిమానులు కాస్త వెలితిగా ఫీలవుతున్నారు. దసరా కానుకగా చెర్రీ సినిమాను విడుదల చేస్తారు.

Next Story