Telugu Global
Cinema & Entertainment

జక్కన్న దృష్టిలో ఆ 2 సినిమాలు

బాహుబలి సినిమా సక్సెస్ తో మంచి ఊపుమీదున్న రాజమౌళిని ఇప్పుడు రెండు సినిమాలు విపరీతంగా ఆకర్షించాయి. ఆ రెండు సినిమాల విడుదల కోసం జక్కన్న ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. అవే సైజ్ జీరో, నాయకి. లేడీ ఓరియంటెడ్ సినిమాలుగా వస్తున్న ఈ రెండు సినిమాల్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు రాజమౌళి. సైజ్ జీరో సినిమాలో అనుష్క లావుగా కనిపించి అందర్నీ ఆకర్షించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రాజమౌళికి తెగ నచ్చేసింది.  ఈ పాత్ర చేయాలంటే అది […]

జక్కన్న దృష్టిలో ఆ 2 సినిమాలు
X
బాహుబలి సినిమా సక్సెస్ తో మంచి ఊపుమీదున్న రాజమౌళిని ఇప్పుడు రెండు సినిమాలు విపరీతంగా ఆకర్షించాయి. ఆ రెండు సినిమాల విడుదల కోసం జక్కన్న ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. అవే సైజ్ జీరో, నాయకి. లేడీ ఓరియంటెడ్ సినిమాలుగా వస్తున్న ఈ రెండు సినిమాల్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు రాజమౌళి. సైజ్ జీరో సినిమాలో అనుష్క లావుగా కనిపించి అందర్నీ ఆకర్షించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రాజమౌళికి తెగ నచ్చేసింది. ఈ పాత్ర చేయాలంటే అది అనుష్కకే సాధ్యమంటూ మెచ్చుకున్నాడు. మరోవైపు తమిళనాట తెరకెక్కుతున్న త్రిష కొత్త సినిమా నాయిక ఫస్ట్ లుక్ కూడా జక్కన్నకు బాగా నచ్చింది. సంప్రదాయచీరకట్టులో కనిపిస్తూనే చేతిలో కత్తిపట్టుకున్న త్రిషను చూసి షాకయ్యాడట రాజమౌళి. సినిమా కచ్చితంగా సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతోందంటూ ట్వీట్ చేశాడు. అలా తన ట్వీట్స్ తో అనుష్క, త్రిషను ఆకాశానికెత్తేశాడు రాజమౌళి. సినిమాలు రెండూ కచ్చితంగా హిట్టవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు.
First Published:  20 Aug 2015 7:05 PM GMT
Next Story