Telugu Global
Others

నిమజ్జనంపై నిషేధం ఈ ఏడాది అసాధ్యం: హైకోర్టు

గణేశ్, దుర్గా విగ్రహాల ఎత్తు తగ్గింపుపై, అలాగే హుస్సేన్‌సాగర్‌లో వాటిని నిమజ్జనం చేయకుండా ఈ ఏడాదికి ఆదేశాలు జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే విగ్రహాల తయారీ ప్రారంభమైనందున ప్రస్తుతం విగ్రహాల ఎత్తుపై పరిమితులు విధించడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొంది. నగర వ్యాప్తంగా చెరువులు, సరస్సుల్లో జరిగే నిమజ్జనం వల్ల అయ్యే కాలుష్యాన్ని నివారించడంకోసం గతంలో హైకోర్టు జారీచేసిన ఆదేశాలను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), హెచ్‌ఎండీఎలు హామీ పత్రం […]

గణేశ్, దుర్గా విగ్రహాల ఎత్తు తగ్గింపుపై, అలాగే హుస్సేన్‌సాగర్‌లో వాటిని నిమజ్జనం చేయకుండా ఈ ఏడాదికి ఆదేశాలు జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే విగ్రహాల తయారీ ప్రారంభమైనందున ప్రస్తుతం విగ్రహాల ఎత్తుపై పరిమితులు విధించడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొంది. నగర వ్యాప్తంగా చెరువులు, సరస్సుల్లో జరిగే నిమజ్జనం వల్ల అయ్యే కాలుష్యాన్ని నివారించడంకోసం గతంలో హైకోర్టు జారీచేసిన ఆదేశాలను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), హెచ్‌ఎండీఎలు హామీ పత్రం ఇవ్వాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది. విగ్రహాల నిమజ్జనంతో కాలుష్యం పెరిగిపోతున్నదని, దీన్ని ఆపడానికి ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్‌ వాదనపై విచారణ జరిపిన హైకోర్టు ఇలాంటి విషయాలపై ముందుగానే కోర్టులను ఆశ్రయించాలని తెలిపింది. విగ్రహాల తయారీ మొదలైన తర్వాత, పండుగలకు కొన్ని రోజుల మాత్రమే గడువు ఉన్న సమయంలో ఉత్తర్వులు జారీచేయడం కష్టసాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేసింది.
First Published:  20 Aug 2015 1:07 PM GMT
Next Story