Telugu Global
Cinema & Entertainment

అఖిల్ సినిమా విడుదల అక్టోబర్ 21

 ఇన్నాళ్లూ అనధికారికంగా జరిగిన ప్రచారం ఇప్పుడు అఫీషియల్ అయింది. అఖిల్-వీవీ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాను అక్టోబర్ 21న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సినిమా షూటింగ్ సంగతుల్ని కూడా వివరించారు. ఈ నెలాఖరుకు 3 పాటలు మినహా మొత్తం షూటింగ్ పూర్తవుతుందని ప్రకటించారు. మిగిలిన 3 పాటల్ని విదేశాలకు వెళ్లకుండా సెట్స్ లేదా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే తీయాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను నాగార్జున […]

అఖిల్ సినిమా విడుదల అక్టోబర్ 21
X
ఇన్నాళ్లూ అనధికారికంగా జరిగిన ప్రచారం ఇప్పుడు అఫీషియల్ అయింది. అఖిల్-వీవీ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాను అక్టోబర్ 21న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సినిమా షూటింగ్ సంగతుల్ని కూడా వివరించారు. ఈ నెలాఖరుకు 3 పాటలు మినహా మొత్తం షూటింగ్ పూర్తవుతుందని ప్రకటించారు. మిగిలిన 3 పాటల్ని విదేశాలకు వెళ్లకుండా సెట్స్ లేదా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే తీయాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 29న విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న అఖిల్ కొత్త సినిమా ఆడియోను కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. సినిమాలో అఖిల్ సరసన సాయేషా సైగల్ హీరోయిన్ గా నటించింది. అఖిల్ హీరోగా వస్తున్న ఈ మొట్టమొదటి సినిమాపై భారీ అంచనాలున్నాయి. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్, తమన్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
Next Story