Telugu Global
Cinema & Entertainment

ఆ ఒప్పందం ప్రకారమే పవన్ చేస్తున్నాడా...

అత్తారింటికి దారేదీ… గబ్బర్‌సింగ్‌లతో హిట్‌ల మీద హిట్‌లు కొడుతున్న పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు కథ, కథనం, స్ర్కీన్‌ ప్లే… అంతా ముగిసినా తనకు అనువైన వేళలో సినిమా చేయడం పవన్‌కు అలవాటు. కాని ఇపుడు అలా కుదిరేట్టు లేదు. గబ్బర్‌సింగ్‌ సీక్వెల్‌గా రీసెంట్‌గా రిలీజైన ‘సర్దార్‌’ ఫస్ట్ లుక్ కూడా సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నఎరోస్ కంపెనీ… పవన్ కల్యాణ్‌కు కండిషన్ పెట్టేందనే న్యూస్ హాట్ టాపిక్‌గా […]

ఆ ఒప్పందం ప్రకారమే పవన్ చేస్తున్నాడా...
X

అత్తారింటికి దారేదీ… గబ్బర్‌సింగ్‌లతో హిట్‌ల మీద హిట్‌లు కొడుతున్న పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు కథ, కథనం, స్ర్కీన్‌ ప్లే… అంతా ముగిసినా తనకు అనువైన వేళలో సినిమా చేయడం పవన్‌కు అలవాటు. కాని ఇపుడు అలా కుదిరేట్టు లేదు. గబ్బర్‌సింగ్‌ సీక్వెల్‌గా రీసెంట్‌గా రిలీజైన ‘సర్దార్‌’ ఫస్ట్ లుక్ కూడా సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నఎరోస్ కంపెనీ… పవన్ కల్యాణ్‌కు కండిషన్ పెట్టేందనే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. సినిమాను ఎరోస్ సంస్థ రూ.80 కోట్లకు కొనుగోలు చేసిందని… ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాత శరత్ మరార్‌తో ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. దీంతో పవన్‌కు ఇష్టం ఉన్నా… లేకున్నా ఈ సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ అల్రేడి పొలిటిషియ‌న్ కావ‌డంతో ఎరోస్ సంస్థ వారు ఈ మెలిక పెట్టార‌ట‌. ఇలా కండిష‌న్స్ పెట్ట‌క పోతే సినిమా నెల‌ల త‌ర‌బ‌డి చేసి .. డిలే చేస్తే త‌మ‌కు న‌ష్టం వ‌స్తుంద‌ని ఎరాస్‌ వాళ్ల బాధ‌ట. ఏదైనా చాలా స్పీడ్‌గా గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్‌గా సర్దార్‌ వ‌చ్చేస్తుంద‌న్న‌మాట‌.​!

Next Story