Telugu Global
Others

మ‌ద్యం పారిస్తే బాబుకు ప‌ట్టిన గ‌తే కేసీఆర్‌కూ: ఐద్వా

రాష్ట్రంలో మ‌ద్య పాన నిషేధం విధించాలని ఐద్వా నేత‌లు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌పై  హింస‌ను, మ‌ద్యాన్ని నియంత్రించాల‌ని కోరుతూ ఐద్వా ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన బ‌స్సు యాత్ర బుధ‌వారం ఖ‌మ్మం జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని ప‌లు మండ‌లాల్లో ఐద్వా రాష్ట్ర  అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ఆశాల‌త‌, బ‌త్తుల హైమావ‌తి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మ‌ధిర  కొత్త బ‌స్టాండు వ‌ద్ద జ‌రిగిన స‌భ‌లో ఆశాల‌త ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. ప్ర‌భుత్వం కొత్త ఎక్సైజ్ పాల‌సీ విధానం ద్వారా […]

రాష్ట్రంలో మ‌ద్య పాన నిషేధం విధించాలని ఐద్వా నేత‌లు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌పై హింస‌ను, మ‌ద్యాన్ని నియంత్రించాల‌ని కోరుతూ ఐద్వా ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన బ‌స్సు యాత్ర బుధ‌వారం ఖ‌మ్మం జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని ప‌లు మండ‌లాల్లో ఐద్వా రాష్ట్ర అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ఆశాల‌త‌, బ‌త్తుల హైమావ‌తి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మ‌ధిర కొత్త బ‌స్టాండు వ‌ద్ద జ‌రిగిన స‌భ‌లో ఆశాల‌త ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. ప్ర‌భుత్వం కొత్త ఎక్సైజ్ పాల‌సీ విధానం ద్వారా గుడుంబాను అరిక‌డ‌తామ‌ని చెబుతూ రాష్ట్రంలో మ‌ద్యం పారించ‌డానికి పాల‌సీల‌ను రూపొందిస్తోంద‌ని ఆమె ఆరోపించారు. మ‌ద్యం ద్వారా వ‌చ్చే ఆదాయంతో ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం సిగ్గుచేట‌ని ఆమె విమ‌ర్శించారు. మ‌ద్య‌పానాన్ని నియంత్రించ‌క పోతే చంద్ర‌బాబుకు ప‌ట్టిన గ‌తే కేసీఆర్‌కూ ప‌డుతుంద‌ని ఆమె హెచ్చ‌రించారు. వరంగ‌ల్ జిల్లా గంగ‌దేవిప‌ల్లిలో సీపీఎం మ‌ద్యపాన నిషేధం విధించింద‌ని, అదేవిధంగా గ్రామ జ్యోతి కార్య‌క్ర‌మంలో మ‌ద్యం వ‌ద్ద‌ని ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా తీర్మానం చేయాల‌ని ఆమె కోరారు.
First Published:  19 Aug 2015 1:11 PM GMT
Next Story