Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 180

కోటు సమస్య బిచ్చగాడు: తల్లి! ఒక పాత కోటు ఉంటే ధర్మం చేయ్యండి ఇల్లాలు: నువ్వు వేసుకున్న కోటు కొత్తగా ఉంది కదా! బిచ్చగాడు: దానివల్ల నా వృత్తి దెబ్బతింటోంది అమ్మగారూ —————————————————————————— ఆవిడంతే! “నువ్వు నమస్తే చెప్పిన ఆవిడ ఎవరు?” “మా పక్కింటి ఆవిడ” “ఆవిడ ఎందుకు నమస్తే చెప్పలేదు?” “ఆవిడకు ఏదీ తిరిగి ఇచ్చే అలవాటు లేదు” —————————————————————————— నిద్రకు మందు “డాక్టరుగారూ! నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ఏమైనా మందులివ్వండి.” “చక్కటి వాతావరణం, […]

కోటు సమస్య
బిచ్చగాడు: తల్లి! ఒక పాత కోటు ఉంటే ధర్మం చేయ్యండి
ఇల్లాలు: నువ్వు వేసుకున్న కోటు కొత్తగా ఉంది కదా!
బిచ్చగాడు: దానివల్ల నా వృత్తి దెబ్బతింటోంది అమ్మగారూ
——————————————————————————
ఆవిడంతే!
“నువ్వు నమస్తే చెప్పిన ఆవిడ ఎవరు?”
“మా పక్కింటి ఆవిడ”
“ఆవిడ ఎందుకు నమస్తే చెప్పలేదు?”
“ఆవిడకు ఏదీ తిరిగి ఇచ్చే అలవాటు లేదు”
——————————————————————————
నిద్రకు మందు
“డాక్టరుగారూ! నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ఏమైనా మందులివ్వండి.”
“చక్కటి వాతావరణం, మెత్తని పరుపు, నీలం రంగు బెడ్‌లైట్‌, చూపుకు ఆనందానిచ్చే చిత్రాలు అమర్చిన గదయితే నిద్ర బాగా పడుతుంది”
“కానీ ఇవన్నీ ఆఫీసులో కుదరవు డాక్టర్‌!”
——————————————————————————
అమ్మ సెంటిమెంట్‌
“నాన్నా కాకి అరిస్తే బంధువులొస్తారా?”
“అవును”
“మరి బంధువులు పోవాలంటే?”
” మీ అమ్మ అరవాలి”

First Published:  19 Aug 2015 1:03 PM GMT
Next Story