Telugu Global
Cinema & Entertainment

  చెర్రికీ షాకిచ్చిన ఇల్లి బేబీ..

టాలీవుడ్ నిర్మాతలకు మరోసారి షాకిచ్చింది ఇలియానా. గతంలో సినిమాకు కోటి రూపాయలు డిమాండ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ గోవాబ్యూటీ. ఒక దశలో కోటీ పాతిక లక్షలు కూడా తీసుకుంది. భలే దొంగలు సినిమాకు ఆమె హయ్యస్ట్ పారితోషికం ఇది. తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడం, సేమ్ టైం బాలీవుడ్ లో క్లిక్ అవ్వడంతో అక్కడికి చెక్కేసింది. అయితే ఇప్పుడు అక్కడ కూడా అమ్మడుకు అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. సో.. ఎటూకాకుండా పోయిన ఇలియానాను […]

  చెర్రికీ షాకిచ్చిన ఇల్లి బేబీ..
X
టాలీవుడ్ నిర్మాతలకు మరోసారి షాకిచ్చింది ఇలియానా. గతంలో సినిమాకు కోటి రూపాయలు డిమాండ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ గోవాబ్యూటీ. ఒక దశలో కోటీ పాతిక లక్షలు కూడా తీసుకుంది. భలే దొంగలు సినిమాకు ఆమె హయ్యస్ట్ పారితోషికం ఇది. తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడం, సేమ్ టైం బాలీవుడ్ లో క్లిక్ అవ్వడంతో అక్కడికి చెక్కేసింది. అయితే ఇప్పుడు అక్కడ కూడా అమ్మడుకు అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. సో.. ఎటూకాకుండా పోయిన ఇలియానాను మరోసారి అక్కునచేర్చుకునేందుకు సిద్ధమైంది టాలీవుడ్. ఓ క్రేజీ ఆఫర్ తో ఆమెను సంప్రదించారు రామ్ చరణ్ నిర్మాతలు. కానీ అవకాశాల్లేకపోయినా ఇలియానా ఆశ మాత్రం చావలేదు. వచ్చిన నిర్మాతకు చుక్కులుచూపించింది. మేటర్ ఏంటంటే.. రామ్ చరణ్-శ్రీనువైట్ల సినిమాతో చిరంజీతో ఓ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటలో ఇలియానాను కూడా తీసుకోవాలనుకున్నారు. ఆఫర్ మంచిదే.. ఒప్పుకుంటే బాగుండేది. కానీ ఇలియానా మాత్రం కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. క్రేజ్ లేకపోయినా కోటి ఎలా అడిగిందో అర్థం కాక నిర్మాతలు జుట్టుపీక్కుంటూ వెనక్కి వచ్చేశారు.
First Published:  19 Aug 2015 7:03 PM GMT
Next Story