Telugu Global
Others

గోదావ‌రి జ‌లాల‌పైనే రాష్ట్ర భ‌విష్య‌త్: ఏపీ సీఎం 

తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్ గోదావ‌రి జ‌లాల‌పైనే ఆధార‌ప‌డి ఉంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంకు  రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వ‌చ్చిన ఆయ‌న కుప్పం ఆర్టీసీ బ‌స్టాండు సెంట‌ర్‌లో నిర్వ‌హించిన చంద్ర‌న్న సంక్షేమ‌బాట స‌భ‌లో ప్ర‌సంగించారు.  ఏటా 3 వేల టీఎంసీల గోదావ‌రి జ‌లాల నీరు స‌ముద్రంలో క‌లుస్తున్నాయి. వాటిని రాయ‌ల‌సీమ‌కు అందించ‌డానికే ప‌ట్టిసీమ ప్రాజెక్టును చేప‌ట్టామ‌ని, ప‌ట్టిసీమ ద్వారా సెప్టెంబ‌రు నాటికి రాయ‌ల‌సీమ‌కు నీరందిస్తామ‌ని చెప్పారు. కుప్పానికి వ‌చ్చే […]

గోదావ‌రి జ‌లాల‌పైనే రాష్ట్ర భ‌విష్య‌త్: ఏపీ సీఎం 
X
తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్ గోదావ‌రి జ‌లాల‌పైనే ఆధార‌ప‌డి ఉంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంకు రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వ‌చ్చిన ఆయ‌న కుప్పం ఆర్టీసీ బ‌స్టాండు సెంట‌ర్‌లో నిర్వ‌హించిన చంద్ర‌న్న సంక్షేమ‌బాట స‌భ‌లో ప్ర‌సంగించారు. ఏటా 3 వేల టీఎంసీల గోదావ‌రి జ‌లాల నీరు స‌ముద్రంలో క‌లుస్తున్నాయి. వాటిని రాయ‌ల‌సీమ‌కు అందించ‌డానికే ప‌ట్టిసీమ ప్రాజెక్టును చేప‌ట్టామ‌ని, ప‌ట్టిసీమ ద్వారా సెప్టెంబ‌రు నాటికి రాయ‌ల‌సీమ‌కు నీరందిస్తామ‌ని చెప్పారు. కుప్పానికి వ‌చ్చే ఏడాది నీరందిస్తాన‌ని, రాయ‌లసీమ‌ నీటి క‌రువును తీర్చేందుకు కృష్ణా, గోదావ‌రి, తుంగ‌భ‌ద్ర నదుల‌ను అనుసంధానం చేయనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అవినీతికి తావులేని పాల‌న అందిస్తాన‌ని డ్వాక్రా మ‌హిళ‌ల‌కు జ‌న‌రిక్ మందుల షాపులు, పొట్టేళ్ల పెంప‌కం, ఈ-కోడి కార్య‌క్ర‌మాలు కూడా అప్ప‌చెబుతాన‌ని ఆయ‌న చెప్పారు. వ‌చ్చే ఏడాది మార్చిలోగా ఇంటింటికీ ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఇస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు. స‌భానంత‌రం ఆయ‌న ద‌ళితవాడలో మునికృష్ణ కుటుంబంతో క‌లిసి భోజ‌నం చేశారు.
First Published:  18 Aug 2015 1:14 PM GMT
Next Story