Telugu Global
Others

ప్రభుత్వ బడుల్లో చేర్చాల్సిందే

అధికారులకు యూపీ హైకోర్టు షాక్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దుస్థితి పట్ల అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, న్యాయ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మంగళవారం ఆదేశించింది. అప్పుడే వారికి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు తెలుస్తాయని, వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలు వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం […]

ప్రభుత్వ బడుల్లో చేర్చాల్సిందే
X
అధికారులకు యూపీ హైకోర్టు షాక్‌
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దుస్థితి పట్ల అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, న్యాయ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మంగళవారం ఆదేశించింది. అప్పుడే వారికి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు తెలుస్తాయని, వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలు వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆరు నెలల తరువాత తమ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని జస్టిస్ సుధీర్ అగర్వాల్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన స్థితికి చేరుకున్నాయని, వాటిలో బోధనా సిబ్బంది సరిగ్గా లేరని ఆరోపిస్తూ ఉమేశ్‌కుమార్‌సింగ్ పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో యూపీలోని దాదాపు 90 శాతం మంది పిల్లలు చదువుకుంటున్నారు. అయితే ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం ప్రభుత్వ బడులకు దూరంగా ఉంటున్నారు. అసలు పాఠశాలల్లో ఉన్న సమస్యలు తెలియాలంటే అధికారుల, రాజకీయ నాయకుల పిల్లలు తప్పనిసరిగా అక్కడే చదవాలని అప్పడే సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ ఉత్తర్వులను ఆషామాషిగా తీసుకోకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఖచ్చితంగా అమలు అయ్యేట్లు చూడాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టు ఆదేశించింది.
First Published:  19 Aug 2015 12:55 AM GMT
Next Story