Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 178

గుడిలో “నువ్వు ప్రతి అమ్మాయినీ ఏ పార్కుకో, బీచికో తీసుకెళ్లకుండా గుడిలోకి తీసుకెళ్లి “ఐ లవ్‌ యూ” చెబుతావెందుకు?” సందేహంగా అడిగాడు శ్రీను. “గుడిలో అయితే చెప్పులేసుకోకుండా ఉంటారు కదా” చెప్పాడు రవి. ————————————————————————————- అదృష్టవంతులు “మా ఆవిడ వీణ వాయించేది. పిల్లలు పుట్టాక మానేసింది.” “మీ పిల్లలు అదృష్టవంతులు.” ————————————————————————————- అయోమయ తీర్పు కోర్టులో వాదోపవాదాలు సీరియస్‌గా జరుగుతున్నాయి. ఒకే వ్యక్తి ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నాడన్న ఆరోపణలపై విచారణ ముగిసింది. చివరకు జడ్జి తీర్పు […]

గుడిలో
“నువ్వు ప్రతి అమ్మాయినీ ఏ పార్కుకో, బీచికో తీసుకెళ్లకుండా గుడిలోకి తీసుకెళ్లి “ఐ లవ్‌ యూ” చెబుతావెందుకు?” సందేహంగా అడిగాడు శ్రీను.
“గుడిలో అయితే చెప్పులేసుకోకుండా ఉంటారు కదా” చెప్పాడు రవి.
————————————————————————————-
అదృష్టవంతులు
“మా ఆవిడ వీణ వాయించేది. పిల్లలు పుట్టాక మానేసింది.”
“మీ పిల్లలు అదృష్టవంతులు.”
————————————————————————————-
అయోమయ తీర్పు
కోర్టులో వాదోపవాదాలు సీరియస్‌గా జరుగుతున్నాయి. ఒకే వ్యక్తి ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నాడన్న ఆరోపణలపై విచారణ ముగిసింది. చివరకు జడ్జి తీర్పు చెప్పాడు. “ఏమయ్యా నీపై వచ్చిన ఆరోపణలకు రుజువులు లేవు. ఇక నీకు ఏ ఇబ్బందీ లేదు. హాయిగా ఇంటికి వెళ్లిపోవచ్చు” అన్నాడు. వెంటనే కోర్టులో చేతులు కట్టుకున్న ఆ వ్యక్తి “ఏ ఇంటికి సార్‌, చిన్న ఇంటికా? పెద్ద ఇంటికా?” అనేసరికి హాలులో ఉన్న వారంతా పకపకా నవ్వేశారు.
————————————————————————————-
చెల్లుకు చెల్లు
“మీ ఆవు తోటలో మొక్కల్ని తినేసింది.”
“సరే రేపు హాఫ్‌ లీటర్‌ పాలు పంపిస్తాలే.”
————————————————————————————-
ఎరక్కపోయి
చుట్టూ ఎవరూ లేరు. ఒక వ్యక్తికి ఎదురుగా ఇంకో వ్యక్తి వస్తున్నాడు. రెండో వ్యక్తి మొదటి వ్యక్తితో “ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా పోలీసు కనిపించాడా?” అని అడిగాడు.
మొదటి వ్యక్తి “మైలు దూరం నుండి వస్తున్నా. ఎక్కడా కనిపించలేదు” అన్నాడు.
రెండో వ్యక్తి “అయితే మర్యాదగా నీ పర్సు, వాచీ ఇవ్వు” అని బెదిరించాడు.

First Published:  17 Aug 2015 1:03 PM GMT
Next Story