Telugu Global
Others

డిజైన్ మారితే రంగారెడ్డి జిల్లా ఎడారే

ప్రాణ‌హిత – చేవెళ్ల డిజైన్ మార్చితే రంగారెడ్డి జిల్లా ఎడారిగా మారుతుంద‌ని అఖిల‌ప‌క్ష నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రంగారెడ్డి జిల్లాకు సాగునీరు, హైద‌రాబాద్‌కు తాగునీరు అందించ‌డానికి దివంగ‌త  సీఎం రాజశేఖ‌ర్‌రెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చ‌డానికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌మ‌ని  నేత‌లు స్ప‌ష్టం  చేశారు. అఖిల‌ప‌క్ష నేత‌లు శంక‌ర్‌ప‌ల్లి మండ‌లం మహాలింగపురం గ్రామ‌శివారులో జ‌రుగుతున్న ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా నేత‌లు మాట్లాడుతూ  కృష్ణా గోదావ‌రి న‌దుల అనుసంధానంతో  నీరు వ‌చ్చేలా నిర్మిస్తున్న […]

ప్రాణ‌హిత – చేవెళ్ల డిజైన్ మార్చితే రంగారెడ్డి జిల్లా ఎడారిగా మారుతుంద‌ని అఖిల‌ప‌క్ష నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రంగారెడ్డి జిల్లాకు సాగునీరు, హైద‌రాబాద్‌కు తాగునీరు అందించ‌డానికి దివంగ‌త సీఎం రాజశేఖ‌ర్‌రెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చ‌డానికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌మ‌ని నేత‌లు స్ప‌ష్టం చేశారు. అఖిల‌ప‌క్ష నేత‌లు శంక‌ర్‌ప‌ల్లి మండ‌లం మహాలింగపురం గ్రామ‌శివారులో జ‌రుగుతున్న ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా నేత‌లు మాట్లాడుతూ కృష్ణా గోదావ‌రి న‌దుల అనుసంధానంతో నీరు వ‌చ్చేలా నిర్మిస్తున్న ప్రాజెక్టును అడ్డుకోవ‌డం సీఎంకు త‌గ‌ద‌ని అన్నారు. వెయ్యికోట్ల ప‌నులు పూర్త‌యిన త‌ర్వాత ప్రాజెక్టు డిజైన్ మార్చాల‌న‌డం స‌మంజ‌సం కాద‌ని హిత‌వు ప‌లికారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎం త‌దిత‌ర పార్టీల నేత‌లు పాల్గొన్నారు.
First Published:  17 Aug 2015 1:11 PM GMT
Next Story