Telugu Global
Others

యూనిఫాం ఉద్యోగాల‌కూ వ‌యస్సు స‌డ‌లించే యోచ‌న‌

ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఉద్యోగాల‌కు ప‌దేళ్ల పాటు వ‌యో ప‌రిమితిని స‌డ‌లించిన రాష్ట్ర ప్ర‌భుత్వం పోలీస్ ఉద్యోగాలకు కూడా వ‌యోప‌రిమితిని స‌డ‌లించాల‌నే యోచ‌న‌లో ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కానిస్టేబుల్‌కు ఐదు సంవ‌త్స‌రాలు, ఎస్‌.ఐ. పోస్టుకు మూడేళ్ల పాటు స‌డ‌లించే అంశం ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉంది. యూనిఫాం ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితిని పెంచాల‌ని ప్ర‌భుత్వానికి  పెద్ద‌ సంఖ్య‌లో విజ్ఞ‌ప్తులు వ‌చ్చిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం  స్పందించింది. పోలీసు వ‌యోప‌రిమితిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించింది. దీంతో అధికారులు 18 నుంచి […]

ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఉద్యోగాల‌కు ప‌దేళ్ల పాటు వ‌యో ప‌రిమితిని స‌డ‌లించిన రాష్ట్ర ప్ర‌భుత్వం పోలీస్ ఉద్యోగాలకు కూడా వ‌యోప‌రిమితిని స‌డ‌లించాల‌నే యోచ‌న‌లో ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కానిస్టేబుల్‌కు ఐదు సంవ‌త్స‌రాలు, ఎస్‌.ఐ. పోస్టుకు మూడేళ్ల పాటు స‌డ‌లించే అంశం ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉంది. యూనిఫాం ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితిని పెంచాల‌ని ప్ర‌భుత్వానికి పెద్ద‌ సంఖ్య‌లో విజ్ఞ‌ప్తులు వ‌చ్చిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం స్పందించింది. పోలీసు వ‌యోప‌రిమితిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించింది. దీంతో అధికారులు 18 నుంచి 21 వ‌ర‌కున్న‌ కానిస్టేబుల్ వ‌యోప‌రిమితిని 25కు, ఎస్ఐల వ‌యోప‌రిమితిని 25 నుంచి 28కు స‌డ‌లిస్తూ ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించింద‌ని స‌మాచారం. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని పోలీసు అధికారులు చెబుతున్నారు.
First Published:  17 Aug 2015 1:14 PM GMT
Next Story