మెగాస్టార్ చివరకు తమిళ డైరెక్టర్ కే ఓటేస్తాడా..!
స్టాలిన్ చిత్రం ఎలా ఉంది.? మాస్ మసాలా ఇష్టపడే ఆడియన్స్ కు నచ్చలేదు కానీ.. చిరంజీవి ని ఒక గొప్ప నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ చేసిన ఈ చిత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీకి హెల్ప్ అయ్యింది. నీవు సహాయం పొందితే.. మరో ముగ్గురికి సహాయం చేయి అంటూ చేసిన ఈ పాయింట్ అభిమానుల్ని అలరించింది. ఈ సినిమా ను డైరెక్ట్ చేసింది తమిళ దర్శకుడు మురగదాస్. ప్రాధమికంగా మంచి రచయిత అయిన మురగాదాస్ […]
BY admin16 Aug 2015 7:10 PM GMT
X
admin Updated On: 17 Aug 2015 2:33 AM GMT
స్టాలిన్ చిత్రం ఎలా ఉంది.? మాస్ మసాలా ఇష్టపడే ఆడియన్స్ కు నచ్చలేదు కానీ.. చిరంజీవి ని ఒక గొప్ప నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ చేసిన ఈ చిత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీకి హెల్ప్ అయ్యింది. నీవు సహాయం పొందితే.. మరో ముగ్గురికి సహాయం చేయి అంటూ చేసిన ఈ పాయింట్ అభిమానుల్ని అలరించింది. ఈ సినిమా ను డైరెక్ట్ చేసింది తమిళ దర్శకుడు మురగదాస్. ప్రాధమికంగా మంచి రచయిత అయిన మురగాదాస్ చిన్న వయసులోనే ప్రతిభా వంతమైన డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియాలో ఏ హీరో అయినా మురగదాస్ స్టోరి చెబితే .. సినిమా చేయడానికి రెడీగా ఉంటారు అనడంలో సందేహాం లేదు. ఏ హీరో అయిన అంటే .. స్టార్స్ ..సూపర్స్ స్టార్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పడం జరిగింది.
ఇక చిరు 150 వ సినిమాకు టాలీవుడ్ లో కథను అందించే రచయితే దొరకడం లేదు. అందుకే చివరకు మురగదాస్ గత యేడాది విజయ్ తో చేసిన 'కత్తి' సినిమాను చిరు రీమేక్ చేసే ఆలోచన చేస్తున్నాడని ఆయన సన్నిహితలు సమాచారం. ఈ మధ్య పూరి జగన్నాధ్ అంత సిద్దం చేశాడని టాక్ బయటకు వచ్చింది. చరణ్ కూడా అధికారికంగా చెప్పాడు. అయితే సెకండాఫ్ ఇంకా సిద్దం కాలేదని..తెలుస్తుంది. 60 యేళ్ల వయసున్న చిరు.. ఇప్పుడు పాతికేళ్ల కుర్రాడిగా మెప్పించడం కష్టమే. అందుకే ఆయన వయసుకు తగ్గట్లు.. ఆయన స్టార్ డమ్ తగ్గకుండా స్టోరి ఉండాలి. అటువంటి స్టోరిలు మురగదాస్ లాంటి డైరెక్టర్ చేస్తాడు. ఆ విషయం మెగా స్టార్ కు తెలుసు. శంకర్ తరువాత.. సోషల్ కాన్సెఫ్ట్ ను కమర్షియల్ చిత్రంతో డీల్ చేయగల డైరెక్టర్ మురగదాస్. సో మొత్తం మీద చిరు కత్తి సినిమాను రీమేక్ చేయడానికే బాగా మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఏ విషయం ఆయన బర్త్ డే రోజు తెలియ నుంది మరి. ఈ నెల 22 న చిరు బర్త్ డే ని భారీగా జరపడానికి అభిమానులు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.
Next Story