విశాఖలో 'స్వచ్ఛ' సాగర తీరం
సాగరతీరంలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలన్న లక్ష్యంతో విశాఖలో స్వచ్ఛ తీరం కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచిన ఆర్కే బీచ్‌తోపాటు మరో ఐదు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో విశాఖపట్టణం ఎంపీ హరిబాబు పాల్గొన్నారు. 20 మంది స్వచ్ఛ్ భారత్ అంబాసిడర్లతోపాటు పలు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు. తీర ప్రాంతంలో ఉన్న చెత్తాచెదారలను తొలగించారు. స్వచ్ఛ్ భారత్ కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని ఎంపీ హరిబాబు […]
BY sarvi17 Aug 2015 12:31 AM GMT
X
sarvi Updated On: 17 Aug 2015 12:31 AM GMT
సాగరతీరంలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలన్న లక్ష్యంతో విశాఖలో స్వచ్ఛ తీరం కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచిన ఆర్కే బీచ్‌తోపాటు మరో ఐదు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో విశాఖపట్టణం ఎంపీ హరిబాబు పాల్గొన్నారు. 20 మంది స్వచ్ఛ్ భారత్ అంబాసిడర్లతోపాటు పలు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు. తీర ప్రాంతంలో ఉన్న చెత్తాచెదారలను తొలగించారు. స్వచ్ఛ్ భారత్ కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛంద సంస్ధలు, ప్రజల భాగస్వామ్యంతోనే… ఇది విజయవంతమవుతుందని అన్నారు.
Next Story