Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతి బరిలో స్టార్ హీరోస్

సంక్రాంతి రావడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ సంక్రాంతి ఫీవర్ మాత్రం అప్పుడే మొదలైంది. మహేష్, పవన్ సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరిలో సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు నిర్మాతలు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేయబోతున్న బ్రహ్మోత్సవం సినిమాను సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచనలోనే ఉన్నారు. అటు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ సర్దార్ సినిమా ఎలాగూ సంక్రాంతికే వస్తుంది. ఈ ఇద్దరు హీరోలు పొంగల్ బరిని పంచుకుంటారనుకునే టైమ్ లో ఇప్పుడు బాబాయ్-అబ్బాయ్ కూడా సిద్ధమౌతున్నట్టు […]

సంక్రాంతి బరిలో స్టార్ హీరోస్
X
సంక్రాంతి రావడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ సంక్రాంతి ఫీవర్ మాత్రం అప్పుడే మొదలైంది. మహేష్, పవన్ సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరిలో సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు నిర్మాతలు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేయబోతున్న బ్రహ్మోత్సవం సినిమాను సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచనలోనే ఉన్నారు. అటు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ సర్దార్ సినిమా ఎలాగూ సంక్రాంతికే వస్తుంది. ఈ ఇద్దరు హీరోలు పొంగల్ బరిని పంచుకుంటారనుకునే టైమ్ లో ఇప్పుడు బాబాయ్-అబ్బాయ్ కూడా సిద్ధమౌతున్నట్టు సమాచారం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాను సంక్రాంతి కానుకగానే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. నాన్నకు ప్రేమతో అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయాలని నిర్ణయించినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. మరోవైపు బాలయ్య చేస్తున్న 99వ సినిమా డిక్టేటర్ ను కూడా సంక్రాంతికే తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్నారు మేకర్స్. ఎరోస్ ఇంటర్నేషనల్ పతాకంపై తెరకెక్కుతున్న డిక్టేటర్ ను జనవరి 14న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. మరి ఇన్ని భారీ బడ్జెట్ చిత్రాలు ఒకేసారి పండక్కి విడుదలవుతాయా.. వీటిలోంచి ఎన్ని కన్ ఫర్మ్ అవుతాయి.. ఎన్ని డ్రాప్ అవుతాయి.. లెట్స్ వెయిట్ అండ్ సీ..
Next Story