Telugu Global
Cinema & Entertainment

రథంతోనే రుద్రమదేవి ప్రమోషన్

ఇప్పటికే రోజుకో ఫోటో విడుదల చేస్తూ ప్రమోషన్ ను కొత్తపుంతలు తొక్కిస్తున్నాడు గుణశేఖర్. ఇప్పుడు తాజాగా రుద్రమదేవి ప్రమోషన్ కు సంబంధించి మరో ప్రయోగాత్మక ప్రమోషన్ కు సిద్ధమౌతున్నాడు. సినిమాలో రుద్రమదేవి వాడిన రథాన్ని బయటకు తీయబోతున్నాడు. అవును.. రుద్రమదేవి పాత్రధారి అనుష్క సినిమాలో ఏ రథాన్ని అయితే వాడిందో.. అదే రథాన్ని తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టించాలనుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో అదే రథంపై ప్రయాణిస్తూ సినిమాకు ప్రచారం కల్పించాలనుకుంటున్నాడు గుణశేఖర్. అంటే.. […]

రథంతోనే రుద్రమదేవి ప్రమోషన్
X
ఇప్పటికే రోజుకో ఫోటో విడుదల చేస్తూ ప్రమోషన్ ను కొత్తపుంతలు తొక్కిస్తున్నాడు గుణశేఖర్. ఇప్పుడు తాజాగా రుద్రమదేవి ప్రమోషన్ కు సంబంధించి మరో ప్రయోగాత్మక ప్రమోషన్ కు సిద్ధమౌతున్నాడు. సినిమాలో రుద్రమదేవి వాడిన రథాన్ని బయటకు తీయబోతున్నాడు. అవును.. రుద్రమదేవి పాత్రధారి అనుష్క సినిమాలో ఏ రథాన్ని అయితే వాడిందో.. అదే రథాన్ని తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టించాలనుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో అదే రథంపై ప్రయాణిస్తూ సినిమాకు ప్రచారం కల్పించాలనుకుంటున్నాడు గుణశేఖర్. అంటే.. మరికొన్ని రోజుల్లో అనుష్క నిజంగానే రోడ్డుపై రథంతో దర్శనమిస్తుందన్నమాట. అంతేకాదు.. రథంలో అనుష్క పక్కన రానా, అల్లు అర్జున్ కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఊరిస్తున్నాడు దర్శకుడు గుణ. ప్రేక్షకులకు మరో బంపర్ ఆఫర్ కూడా పెట్టాడు. అలా ఊరేగుతున్న రథాన్ని ఫొటో తీసి తమకు పంపిస్తే, లక్కీ విన్నర్ కు ఉచితంగా టిక్కెట్లు కూడా ఇస్తామంటున్నాడు. ఈ ప్రచార ఎత్తగడ ఏదో బాగానే ఉన్నట్టుంది.
First Published:  16 Aug 2015 7:03 PM GMT
Next Story