Telugu Global
Others

రాజ‌మండ్రిలో అండ‌ర్ గ్రౌండ్ ఉరికంబం 

దేశంలోనే తొలిసారిగా అండ‌ర్ గ్రౌండ్ ఉరికంబాన్ని రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో నిర్మించారు. మ‌ర‌ణ‌శిక్ష ప‌డిన ఖైదీల‌ను ఉరితీసే ఉరికంబ ప్రాంతాన్ని గ్యాలోస్ అంటారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్ ప‌రిపాల‌నాభ‌వ‌నం బ్లాక్ కింద గ్యాలోస్‌ను ఏర్పాటు చేశారు. గ్యాలోస్‌ను త్వ‌ర‌లో ప్రారంభించేందుకు జైళ్ల శాఖ స‌న్నాహాలు చేస్తోంది. రాజ‌మండ్రి జైల్లో బ్రిటీష్ కాలం  1875 నుంచి గ్యాలోస్ కొన‌సాగుతోంది. 1980 వ‌ర‌కు జైలు ప్ర‌ధాన‌ద్వారం ప‌క్క‌నున్న గ్యాలోస్‌ను ఆ త‌ర్వాత ప‌రిపాల‌నాభ‌వ‌నం ప‌క్క‌నున్న ఖాళీ ప్రదేశంలోకి మార్చారు. ఈ […]

రాజ‌మండ్రిలో అండ‌ర్ గ్రౌండ్ ఉరికంబం 
X
దేశంలోనే తొలిసారిగా అండ‌ర్ గ్రౌండ్ ఉరికంబాన్ని రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో నిర్మించారు. మ‌ర‌ణ‌శిక్ష ప‌డిన ఖైదీల‌ను ఉరితీసే ఉరికంబ ప్రాంతాన్ని గ్యాలోస్ అంటారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్ ప‌రిపాల‌నాభ‌వ‌నం బ్లాక్ కింద గ్యాలోస్‌ను ఏర్పాటు చేశారు. గ్యాలోస్‌ను త్వ‌ర‌లో ప్రారంభించేందుకు జైళ్ల శాఖ స‌న్నాహాలు చేస్తోంది. రాజ‌మండ్రి జైల్లో బ్రిటీష్ కాలం 1875 నుంచి గ్యాలోస్ కొన‌సాగుతోంది. 1980 వ‌ర‌కు జైలు ప్ర‌ధాన‌ద్వారం ప‌క్క‌నున్న గ్యాలోస్‌ను ఆ త‌ర్వాత ప‌రిపాల‌నాభ‌వ‌నం ప‌క్క‌నున్న ఖాళీ ప్రదేశంలోకి మార్చారు. ఈ ప్ర‌దేశంలో కొత్త‌గా ప‌రిపాల‌నా భ‌వనం నిర్మించ‌డంతో అదే భ‌వ‌నం కింద భూగ‌ర్భంలో గ్యాలోస్‌ను నిర్మించారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఆఖ‌రిసారిగా 1976 ఫిబ్ర‌వ‌రిలో అనంత‌పురం జిల్లాకు చెందిన నంబి కిష్ట‌ప్ప‌ను ఉరితీశారు.
First Published:  16 Aug 2015 1:14 PM GMT
Next Story