Telugu Global
Cinema & Entertainment

శరవేగంగా దూసుకొస్తున్న ఏమాయచేశావె టీం

ఏమాయచేశావె సినిమా అందరికీ సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమాతో నాగచైతన్య కెరీర్ లోనే తొలిసారిగా హిట్ అఁదుకుంటే.. సమంత అయితే ఏకంగా స్టార్ అయిపోయింది. మరోవైపు దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా చాన్నాళ్ల తర్వాత హిట్ అందుకున్నాడు. అటు మ్యూజిక్ డైరక్టర్ రెహ్మాన్ కూడా మంచి విజయాన్నందుకున్నాడు. ఇప్పుడీ టీం అంతా కలిసి మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్ గా మాత్రం సమంత ప్లేస్ లో మంజుమా మోహన్ ను తీసుకున్నారు. ప్రస్తుతం […]

శరవేగంగా దూసుకొస్తున్న ఏమాయచేశావె టీం
X
ఏమాయచేశావె సినిమా అందరికీ సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమాతో నాగచైతన్య కెరీర్ లోనే తొలిసారిగా హిట్ అఁదుకుంటే.. సమంత అయితే ఏకంగా స్టార్ అయిపోయింది. మరోవైపు దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా చాన్నాళ్ల తర్వాత హిట్ అందుకున్నాడు. అటు మ్యూజిక్ డైరక్టర్ రెహ్మాన్ కూడా మంచి విజయాన్నందుకున్నాడు. ఇప్పుడీ టీం అంతా కలిసి మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్ గా మాత్రం సమంత ప్లేస్ లో మంజుమా మోహన్ ను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకు లోయల్లోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నైలో మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను వినాయక చవితి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మనం తర్వాత సరైన సక్సెస్ అందుకోలేకపోయిన చైతూ, ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. పైగా తనకు కలిసొచ్చిన దర్శకుడు కూడా కావడంతో హిట్ గ్యారెంటీ అనే ధీమాతో ఉన్నాడు. రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
First Published:  16 Aug 2015 7:02 PM GMT
Next Story