Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 177

స్థాయి “మన పక్కింటి అప్పారావు అట్టడుగు స్థాయి నుంచి పైకొచ్చాడు తెలుసా?” “ఎలాగ?” “మొదట్లో చెప్పుల వ్యాపారం చేసేవాడు. ఇప్పుడేమో గొడుగుల వ్యాపారం చేస్తున్నాడు!” —————————————————————————————————— పరవశం “ఈ ఉత్తరం ఎన్నిసార్లు చదివినా తనివి తీరడం లేదురా” అన్నాడు శివ. “అలాగా? ఇంతకీ ఎవరు రాశారు? ఏం రాశారు?” కుతూహలంగా అడిగాడు రాఘవ. “పుట్టింటికి వెళ్లిన మా ఆవిడ రాసింది. మరో 15 రోజుల దాకా ఇంటికి రాదటరా” పరవశంగా చెప్పాడు శివ. —————————————————————————————————— అందం-ఫోటో ఆవిడ […]

స్థాయి
“మన పక్కింటి అప్పారావు అట్టడుగు స్థాయి నుంచి పైకొచ్చాడు తెలుసా?”
“ఎలాగ?”
“మొదట్లో చెప్పుల వ్యాపారం చేసేవాడు. ఇప్పుడేమో గొడుగుల వ్యాపారం చేస్తున్నాడు!”
——————————————————————————————————
పరవశం
“ఈ ఉత్తరం ఎన్నిసార్లు చదివినా తనివి తీరడం లేదురా” అన్నాడు శివ.
“అలాగా? ఇంతకీ ఎవరు రాశారు? ఏం రాశారు?” కుతూహలంగా అడిగాడు రాఘవ.
“పుట్టింటికి వెళ్లిన మా ఆవిడ రాసింది. మరో 15 రోజుల దాకా ఇంటికి రాదటరా” పరవశంగా చెప్పాడు శివ.
——————————————————————————————————
అందం-ఫోటో
ఆవిడ స్టూడియోకు వెళ్లి ఫోటోలు తీసుకుంది.
తన ఫోటోలు చూసుకుని “ఇవి నాకు నచ్చలేదు” అంది.
ఫోటోగ్రాఫర్‌ ఆమెను చూసి నవ్వుతూ “ఆ సంగతి మీరు ఫోటోలు దిగకముందు ఆలోచించాలి” అన్నాడు.
——————————————————————————————————
అస్సలిష్టం ఉండదు.
జనాలతో కిక్కిరిసిపోయిన బస్సులో ఒంటి కాలి మీద నుంచున్న అప్పారావు సీనియర్‌ సిటిజన్స్‌ సీటులో కూర్చున్న యువకుడు కళ్లు మూసుకుని ఉండటం గమనించాడు.
“ఏంటి విషయం? ఒంట్లో బాలేదా” అని అడిగాడు.
“లేదు, నేను బాగానే ఉన్నాను. ముసలి వాళ్లు అలా నిల్చోడం చూడ్డం అస్సలు ఇష్టం ఉండదు నాకు” చెప్పాడతను తాపీగా.

First Published:  16 Aug 2015 1:03 PM GMT
Next Story