Telugu Global
Others

వ్యవసాయంతోపాటు పరిశ్రమలు కూడా ముఖ్యమే: చంద్రబాబు

రాష్ట్రానికి వ్యవసాయం ఎంత ముఖ్యమో పరిశ్రమలు కూడా అంతే అవసరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం కర్నూలులో ఆయన రెండు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ 13 జిల్లాలో కర్నూలు, శ్రీకాకుళం జల్లాలు వెనుకబడి ఉన్నాయని అన్నారు. తక్కువ వర్షపాతం పడిన అనంతపురం జిల్లా కూడా కర్నూలు జిల్లా కంటే ముందుందని తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు కొన్ని నిర్ధిష్టమైన హామీలు ఇచ్చానని, ఎన్ని అవంతరాలు ఎదురైనా వాటిని నెరవేరుస్తానని […]

వ్యవసాయంతోపాటు పరిశ్రమలు కూడా ముఖ్యమే: చంద్రబాబు
X
రాష్ట్రానికి వ్యవసాయం ఎంత ముఖ్యమో పరిశ్రమలు కూడా అంతే అవసరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం కర్నూలులో ఆయన రెండు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ 13 జిల్లాలో కర్నూలు, శ్రీకాకుళం జల్లాలు వెనుకబడి ఉన్నాయని అన్నారు. తక్కువ వర్షపాతం పడిన అనంతపురం జిల్లా కూడా కర్నూలు జిల్లా కంటే ముందుందని తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు కొన్ని నిర్ధిష్టమైన హామీలు ఇచ్చానని, ఎన్ని అవంతరాలు ఎదురైనా వాటిని నెరవేరుస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లాలో అంబుజా సిమెంట్‌ పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చారని.. ఆ ప్లాంట్‌కు అనుమతులు ఇచ్చామని, దీని ద్వారా ఇక్కడ ఉపాధి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
పరిశ్రమల ఏర్పాటుకు రూ. 300 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో రూ. 350 కోట్లతో జైన్‌ ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు కానుందని ఆయన వెల్లడించారు. జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయని మొత్తం 17 పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయని, ఈ 17 ప్రాజెక్ట్‌లతో రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని, వీటిద్వారా 18 వేల మందికి ఉపాధి లభిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. 12 నుంచి 18 నెలల్లో పనులు పూర్తి అవుతాయని అన్నారు. రాయలసీమను ఆదుకునేందుకే పట్టిసీమ, గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తామని ఆయన తెలిపారు. రాయలసీమకు నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు… వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నాలు చేశారని, గోదావరి జిల్లాల ప్రజలను రెచ్చగొట్టారని ఆయన విమర్శించారు. జిల్లాకు చెందిన మంత్రి కే.ఈ. కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. రాయలసీమ సస్యశ్యామలం ఆయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు.
First Published:  17 Aug 2015 6:18 AM GMT
Next Story