Telugu Global
Cinema & Entertainment

అనుష్కపై నిత్యామీనన్ కామెంట్స్

కెరీర్ స్టార్టింగ్ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తోటి హీరోహీరోయిన్లను కామెంట్స్ చేయడం నిత్యామీనన్ కు అలవాటు. అది తన పాపులారిటీని దెబ్బతీస్తోందని తెలిసినా కూడా నిత్యామీనన్ మాత్రం- తన వైఖరి మార్చుకోలేదు. గతంలో ఓసారి ప్రభాస్ ఎవరో తనకు తెలియదంటూ స్టేట్ మెంట్ ఇచ్చి వివాదానికి కారణమైంది. ఆ తర్వాత  సీనియర్ హీరోలపై కూడా సెటైర్లు వేసింది. ఈమధ్య శృంగారానికి సంబంధించి బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చి వార్తల్లోకెక్కింది. ఇప్పుడూ కేరళ కుట్టీ మరో […]

అనుష్కపై నిత్యామీనన్ కామెంట్స్
X
కెరీర్ స్టార్టింగ్ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తోటి హీరోహీరోయిన్లను కామెంట్స్ చేయడం నిత్యామీనన్ కు అలవాటు. అది తన పాపులారిటీని దెబ్బతీస్తోందని తెలిసినా కూడా నిత్యామీనన్ మాత్రం- తన వైఖరి మార్చుకోలేదు. గతంలో ఓసారి ప్రభాస్ ఎవరో తనకు తెలియదంటూ స్టేట్ మెంట్ ఇచ్చి వివాదానికి కారణమైంది. ఆ తర్వాత సీనియర్ హీరోలపై కూడా సెటైర్లు వేసింది. ఈమధ్య శృంగారానికి సంబంధించి బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చి వార్తల్లోకెక్కింది. ఇప్పుడూ కేరళ కుట్టీ మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది. అనుష్క నటిస్తున్న సైజీ జీరో ఫస్ట్ లుక్ ను పరిశ్రమ మొత్తం మెచ్చుకుంటుంటే నిత్యామీనన్ మాత్రం సెటైర్లు వేయడం స్టార్ట్ చేసింది. అందులో గొప్పేముంది అన్నట్టు స్టేట్ మెంట్ ఇచ్చింది. అయినా ఓ హీరోయిన్ తగ్గడం కష్టంకానీ లావెక్కడం ఎంతపని అంటూ తేలిగ్గా తీసుకుంది. అంతేకాదు.. ప్రతి ఒక్కరూ సైజ్ జీరో కోసం పాకులాడుతుంటారని, కానీ ఆ ఫిజిక్ తమకు నప్పుతుందో లేదో చెక్ చేసుకోరంటూ నర్మగర్భంగా విమర్శలు చేసింది.
First Published:  16 Aug 2015 6:48 AM GMT
Next Story