Telugu Global
Others

పులుల సంర‌క్ష‌ణ‌కు  పోలీస్‌, పారా మిల‌ట‌రీ త‌ర‌హా శిక్ష‌ణ 

పులుల సంర‌క్ష‌ణ కోసం ప్ర‌త్యేక బ‌ల‌గాలను నియ‌మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది. అట‌వీశాఖ పంపిన ప్ర‌తిపాద‌న‌లను   జాతీయ పులుల సంర‌క్ష‌ణ సంస్థ ఆమోదించింది. రాష్ట్రంలోని 9 అభ‌యారణ్యాల‌కు గాను పులుల ఉనికిని గుర్తించిన రెండు అభ‌యార‌ణ్యాల‌ను టైగ‌ర్ రిజ‌ర్వ్‌గా ప్ర‌క‌టించారు. వీటిలో ఒక‌టి దేశంలోనే అతిపెద్ద‌దైన అమ్రాబాద్ టైగర్ రిజ‌ర్వు. మ‌రోటి క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌. ఒక్కో టైగ‌ర్ రిజ‌ర్వ్‌కు 120 మంది చొప్పున  మొత్తం 240 మంది సిబ్బందిని నియ‌మిస్తారు. వారికి పోలీస్‌, […]

పులుల సంర‌క్ష‌ణ‌కు  పోలీస్‌, పారా మిల‌ట‌రీ త‌ర‌హా శిక్ష‌ణ 
X
పులుల సంర‌క్ష‌ణ కోసం ప్ర‌త్యేక బ‌ల‌గాలను నియ‌మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది. అట‌వీశాఖ పంపిన ప్ర‌తిపాద‌న‌లను జాతీయ పులుల సంర‌క్ష‌ణ సంస్థ ఆమోదించింది. రాష్ట్రంలోని 9 అభ‌యారణ్యాల‌కు గాను పులుల ఉనికిని గుర్తించిన రెండు అభ‌యార‌ణ్యాల‌ను టైగ‌ర్ రిజ‌ర్వ్‌గా ప్ర‌క‌టించారు. వీటిలో ఒక‌టి దేశంలోనే అతిపెద్ద‌దైన అమ్రాబాద్ టైగర్ రిజ‌ర్వు. మ‌రోటి క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌. ఒక్కో టైగ‌ర్ రిజ‌ర్వ్‌కు 120 మంది చొప్పున మొత్తం 240 మంది సిబ్బందిని నియ‌మిస్తారు. వారికి పోలీస్‌, పారా మిల‌ట‌రీ త‌ర‌హాలో శిక్ష‌ణ ఇస్తారు. ఆయుధాల వినియోగంలో సుశిక్షితులై, శారీరకంగా ధృఢంగా ఉన్న 40 ఏళ్ల లోపు వారినే ప్ర‌త్యేక బ‌ల‌గాల్లో నియ‌మిస్తారు
First Published:  14 Aug 2015 1:14 PM GMT
Next Story