Telugu Global
Cinema & Entertainment

శ్రీమంతుడు బాహుబలిని అందుకుంటాడా ?

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. లెక్కలతో సహా నిర్మాతలు వివరించిన కఠోర వాస్తవం. అవును.. మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా 7 రోజుల్లోనే 66 కోట్ల రూపాయల పైచిలుకు వసూళ్లు సాదించిందట. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టిమరీ చిత్ర యూనిట్ ఘనంగా ప్రకటించింది. శ్రీమంతుడు సినిమా వారం రోజుల్లో 66కోట్ల 57 లక్షల 99 వేల 56 రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ఆ సినిమా దర్శకుడు కొరటాల శివ ప్రకటించాడు. అంతేకాదు.. […]

శ్రీమంతుడు బాహుబలిని అందుకుంటాడా ?
X

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. లెక్కలతో సహా నిర్మాతలు వివరించిన కఠోర వాస్తవం. అవును.. మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా 7 రోజుల్లోనే 66 కోట్ల రూపాయల పైచిలుకు వసూళ్లు సాదించిందట. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టిమరీ చిత్ర యూనిట్ ఘనంగా ప్రకటించింది. శ్రీమంతుడు సినిమా వారం రోజుల్లో 66కోట్ల 57 లక్షల 99 వేల 56 రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ఆ సినిమా దర్శకుడు కొరటాల శివ ప్రకటించాడు. అంతేకాదు.. ఏ ఏరియాలో ఎంత వసూలైందనే లెక్కల పత్రాన్ని కూడా మీడియాకు విడుదల చేశాడు. ఈ లెక్కలే నిజమనుకుంటే.. మరో వారం రోజుల్లో శ్రీమంతుడు సినిమా బాహుబలిని దాటేయడం ఖాయం. ఎందుకంటే.. బాహుబలి మేనియా ప్రస్తుతం లేదు. ఆ సినిమా వసూళ్లు వందకోట్లకు అటుఇటుగా ఉన్నాయి. శ్రీమంతుడు హవా ఎంత లేదనుకున్నప్పటికీ మరో వారం, పది రోజులు ఉంటుంది. సో.. తాజా లెక్కల ప్రకారం చూస్తే.. శ్రీమంతుడు బాహుబలిని మించిపోయేలా కనిపిస్తున్నాడు. అయితే ఈ లెక్కలు చూసి కొంతమంది ట్రేడ్ పండిట్స్ మాత్రం ముక్కన వేలేసుకుంటున్నారు.

First Published:  14 Aug 2015 7:02 PM GMT
Next Story