Telugu Global
Cinema & Entertainment

పవన్ సినిమా పేరు సర్దార్ గబ్బర్ సింగ్

మొన్నటివరకు పవన్ కల్యాణ్ సినిమా పేరును గబ్బర్ సింగ్-2 గా వ్యవహరించారు. తర్వాత తమ సినిమా పేరు సర్దార్ అంటూ చెప్పుకొచ్చింది సినిమా యూనిట్. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా పేరు మరోసారి మారింది. గబ్బర్ సింగ్-2ను, సర్దార్ ను కలిపి సర్దార్ గబ్బర్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈసారి మాత్రం పేరు మారదు. ఇదే ఫైనల్. దీనికే ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే.. ఈ టైటిల్ తో ఆగస్ట్ 15 కానుకగా ఫస్ట్ […]

పవన్ సినిమా పేరు సర్దార్ గబ్బర్ సింగ్
X
మొన్నటివరకు పవన్ కల్యాణ్ సినిమా పేరును గబ్బర్ సింగ్-2 గా వ్యవహరించారు. తర్వాత తమ సినిమా పేరు సర్దార్ అంటూ చెప్పుకొచ్చింది సినిమా యూనిట్. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా పేరు మరోసారి మారింది. గబ్బర్ సింగ్-2ను, సర్దార్ ను కలిపి సర్దార్ గబ్బర్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈసారి మాత్రం పేరు మారదు. ఇదే ఫైనల్. దీనికే ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే.. ఈ టైటిల్ తో ఆగస్ట్ 15 కానుకగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. గతంలో పవన్ తయారుచేయించిన స్టిల్ తో ఓ ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటికీ అందులో టైటిల్ లేదు.. తాజాగా విడుదలైన లుక్ లో మాత్రం టైటిల్ తో పాటు పవన్ నయా స్టిల్ కూడా ఉంది. గబ్బర్ సింగ్ కు కొనసాగింపుగా పవన్ ఇందులో ఖాకీ డ్రెస్సులో మెరిసిపోతున్నాడు. ఏకంగా 4 తుపాకులు పట్టుకొని హల్ చల్ చేస్తున్నాడు. గత సినిమా గబ్బర్ సింగ్ తో ఏమాత్రం సంబంధం లేకుండా ఓ సరికొత్త కథతో వస్తున్న ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. శరత్ మరార్ నిర్మాత. ఈ మూవీతో తొలిసారి పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.
First Published:  14 Aug 2015 7:02 PM GMT
Next Story